నాని హీరోయిన్ తో నాగ చైతన్య.!

నాగచైతన్య కెరియర్ లో ‘మజిలీ’ సూపర్ హిట్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా దాదాపు రూ.60 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నాగచైతన్యకు మంచి జోష్ ఇచ్చింది. మజిలీ తరువాత ప్రస్తుతం నాగచైతన్య వెంకిమామ తొ బిజీ గా ఉన్నాడు. వెంకటేష్ కూడా నటిస్తున్నారు మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా తరువాత నాగచైతన్య మరో సినిమాకు సైన్ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఓ లవ్ స్టోరీ సినిమాలో చైతు నటించబోతున్నాడు. ఈ చిత్రంలో నాని జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది . జెర్సీ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. జెర్సీ మంచి హిట్ కొట్టడంతో శ్రద్దా శ్రీనాథ్ కు అవకాశాలు బాగా నే వస్తున్నాయి . శశి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.

Written by Karthik!!