షహీ మష్రుమ్ రిసిపి

రుచికరమైన వంటకాన్ని రుచి చూడాలి అనుకుంటే షాహీ మష్రుమ్ కర్రీ సరైన వంటకం , అంతే కాకుండా ఇదీ ఆరోగ్యానికి చాల మంచి వంటకం , ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి, ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా ఐతే ఇ కింద విధంగా పరిశీలించండి…

Shahi Mushroom Recipes in Telugu

 

కావల్సిన పదార్థాలు:

పుట్టగొడుగులు: 200grms

ఉల్లిపాయలు: 4 (తరిగినవి)

టమోటో: 5 (కట్ చేసుకోవాలి)

అల్లం: 4tsp

పచ్చిమిర్చి: 4 (తరిగినవి)

కారం: ½tsp

గరం మసాలా: ½tsp

పంచదార: 1tsp

ఫ్రెష్ క్రీమ్: 1cup

జీడిపప్పు : ½cup(పేస్ట్ చేసుకోవాలి)

వెన్న (నెయ్యి) : 3tsp

ఉప్పు : రుచికి సరిపడా

కొత్తిమీర : కొద్దిగి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

 

తయారుచేయు విధానం:

  1. ముందుగా చిన్న బౌల్లో, మష్రుమ్ (పుట్టగొడుగులను)రెండు గా కట్ చేసి పెట్టుకోవాలి.
  2. తర్వాత పాన్ లో కొద్దిగా బట్టర్ వేసి అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి పెట్టుకోవాలి.
  3. తర్వాత అందులో అల్లం, పచ్చిమిర్చి మరియు టమోటోలు కూడా వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
  4. వేగించుకొన్ని మిక్సీ జార్ లో వేసి, పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
  5. తర్వాత మరో పాన్ లో కొద్దిగా ఈ పేస్ట్ ను వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.
  6. అందులోనే కారం, గరం మసాలా, జీడిపప్పు పౌడర్ మరియు పంచదార వేసి గ్రేవీ మొత్తం 5నిముషాలు, మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
  7. ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న మష్రుమ్ లను వేసి తక్కువ మంట మీద 10నిముషాలు ఉడికించుకోవాలి.
  8. మష్రుమ్ మెత్తగా ఉడికి, క్రీమ్ మష్రుమ్ కు బాగా పట్టిన తర్వాత మరో రెండు నిముషాలు ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే క్రీమీ షహీ మష్రుమ్ రెడీ.