చరణ్, ఉపాసన ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటే.?

టాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే జంట లలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న వీళ్ళు కూడా ఒకరు. చ‌ర‌ణ్ ఉపాస‌న‌ను ఉప్సి అని ముద్దుగా పిలుచుకుంటే.. చ‌ర‌ణ్‌ను ఉపాస‌న మిస్ట‌ర్ సి అని ప్రేమ‌గా పిలుచుకుంటూ ఉంటారు. రామ్‌చ‌ర‌ణ్‌పై ఉపాస‌నకు.. ఉపాస‌న‌పై రామ్‌చ‌ర‌ణ్‌కు ఉన్న ప్రేమను సోష‌ల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. వీరిద్దరి జంట ని చూస్తే ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ప్ర‌స్తుతం రామ్ చరణ్, ఉపాసన కలసి ఆఫ్రికా స‌మ్మ‌ర్ వెకేష‌న్ కోసం వెళ్లారు. ఈ వెకేష‌న్‌లో భాగంగా వాళ్లు క్రూర జంతువుల మధ్య తీసుకున్న కొన్ని ఫోటోల‌ను ఉపాస‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా ఉపాస‌న పోస్ట్‌ చేసిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ ఫోటోలో ఆమె రెండు సింహ‌పు పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఉపాసన. అలాగే ఈ ఫోటోతో పాటు అస‌లు రామ్‌చ‌ర‌ణ్ న‌న్నెందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు అర్థ‌మైయ్యే ఉంటుంది అనే క్యాప్షన్ జోడించింది. మామూలుగానే ప్రకృతి ప్రేమికురాలు అయినా ఉపాసన మనం ప్ర‌కృతి మాత‌ను గౌర‌వించ‌డం, క్రూర జంతువుల‌ను కూడా గౌరవించడం తెలుసుకోవాలని మరియు వాటి నుండి కూడా కొన్ని పాఠాల‌ను నేర్చుకోవాల‌ని, అలాగే ప్ర‌కృతిని, జంతువుల‌ను గౌర‌వించాలి తెలిపింది. అలాగే రామ్ చరణ్ కూడా జంతు ప్రేమికుడని మనందరికీ తెలిసిన విషయమే ఇలాగే వీళ్లిద్దరు అభిప్రాయాలు అన్ని విషయాలలో కలవడం వలన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అలాగే ఒకరి ఇష్టాలను ఇంకొకరు బాగా అర్థం చేసుకుంటారు కావున వీళ్ళ ప్రేమ, పెళ్లి వరకు వెళ్లిందని చాలాసార్లు రామ్ చరణ్, ఉపాసన తెలియజేశారు.

ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 30, 2020 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *