సపోటా పండు యొక్క అద్భుత రహస్యాలు.!!

Incredible Sapota, Sapota Fruit uses, Sapota Fruit Benfits, Sapota Benfits in Telugu, Health Tips in Telugu, Benefits Of Sapota juice, Health Benefits of Sapodilla, Health Benefits of Sapota, Sapodilla Uses, Mana Telugu Nela,
Courtesy : http://cerev.info

వేసవి కాలములో ఎండలతోపాటు ఏ సీజన్ లోనైనా చల్లదనాన్ని తీసుకువచ్చే తియ్యటి పండు సపోటా పండు. సపోటా పండ్ల పలుచని చర్మం కింద తేనె రంగులో ఉండే రుచులూరించే తియ్యటి గుజ్జుతో తినడానికి చాలా మధురంగా ఉంటుంది. దీంతో ఐస్ క్రీమ్లు (Ice creams), మిల్క్ షేక్స్ (Milk shakes), ప్రూట్ సలాడ్స్(Fruit salad) తయారుచేసుకోవచ్చు. మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఈ పండులో పుష్కలంగా ఉంటుంది.

అలసటను తగ్గించడంలో, రక్తని వృద్ధిలొ సహకరించడంలో ఈ పండు ఎంతోగానో సహాయపడుతుంది. మూడు పండ్లు తీసుకొని పై చర్మం తీసేసి మూడు గ్లాసుల పాలు, ఒక స్పూన్ మీగడ, ఒక స్పూన్ వెనీలా కలపి తయారుచేసిన మిల్క్ షేక్ ఈ కాలంలో ఆరోగ్యవంతమైనదే కాకుండా ఎంతో రుచికరమైన పానీయం కూడా. రోజుకు కనీసం రెండు, మూడు సపోటా పండ్లను తింటే పిల్లలకి మరియు పెద్దలందరికి కూడా ఎన్నో పోషకాలను అందించడంలో సపోటా పండు కీలకమైన పండు అని చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *