ఎన్టీఆర్ తో ఎఫైర్ గురించి ఓపెన్ గా చెప్పిన సమీరా రెడ్డి

టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో నరసింహుడు, అశోక్ మరియు మెగాస్టార్ చిరంజీవి తో జై చిరంజీవ, చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది సమీరా రెడ్డి. తర్వాత టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో సెటిల్ అయింది. కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ప్రత్యేక గీతంలో రానాతో కలిసి చిందేసింది . ఇక విషయానికొస్తే ఎన్టీఆర్ తో కలిసి సమీరా రెడ్డి అశోక్, నరసింహుడు చిత్రాల్లో నటించారు.

అప్పట్లో ఎన్టీఆర్, సమీరారెడ్డి ప్రేమ గురించి రూమర్లు మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయాయి అని తెలిపింది. ఎన్టీఆర్ తో తనకున్న రిలేషన్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అని, ఎన్టీఆర్ స్నేహితుడు కాబట్టే సన్నిహితంగా ఉన్నాను. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. ఈ విషయం ఇంట్లో వాళ్లకి కూడా తెలుసు. ఇలాంటి రూమర్ల వల్ల కెరియర్ నాశనం అవుతుందని టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళాను అని సమీరా రెడ్డి పేర్కొంది.

సమీరారెడ్డి అక్షయ్ వార్థే అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుని స్థిరపడింది. ఇప్పటికే ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం సమీరారెడ్డి గర్భవతి. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *