RRR కి మళ్ళీ ఎదురుదెబ్బ, ఫాన్స్ కి నిరీక్షణ తప్పదా?

జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించడానికి గతంలో ఎంపిక చేసిన డైసి ఎడ్గార్ జోన్స్ తప్పుకోవడంతో జక్కన్నకు పెద్ద టెన్షన్ గా మారినట్టు సినీ వర్గాలనుండి సమాచారం. రాం చరణ్ కు అలియా భట్ సెట్ అయింది, కాని జూనియర్ ఎన్టీఆర్ కు తగ్గ జోడిని వెతికి పట్టుకుండే వేటలో జరుగుతున్న ఆలస్యం తారక్ కి బాగా టెన్షన్ పెడుతోందట. నిన్నటి దాకా సాహో ఫేం శ్రద్ధా కపూర్ పేరు బాగా వినిపించింది కాని తనకున్న కమిట్ మెంట్స్ దృష్ట్యా ఇది చేయలేనని తను వ్యక్తం చేసినట్టు ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉంది.

కొందరు పరిణితి చోప్రా అన్నారు కాని ఈ నటి కొంచెం ముదురుగా అనిపిస్తుందని ఈ భామ జూనియర్ పక్కన సెట్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని వార్తలుకూడా వినిపిస్తున్నాయి. మరోవైపు తెరపైకి వచ్చిన శ్రీలంకన్ బ్యూటీ బాలీవుడ్ సుందరి జాక్వలిన్ ఫెర్నాండేజ్ పేరుని పరిశీలిస్తున్నట్టు మరో టాక్ వచ్చింది.

కథ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న భీమ్ పాత్ర ప్రేమించేది ఒక బ్రిటిష్ అమ్మాయిని. ఆ పాత్రకు పాశ్చాత్య లక్షణాలున్న కలిగివున్న మోడల్ అయితేనే సూటవుతుందని సమాచారం. లేదంటే కథనే అనుకూలంగా మార్చాల్సి వస్తుంది. అమీ జాక్సన్ పర్ఫెక్ట్ ఛాయస్ గా నిలిచేది కాని తను ఇప్పుడు గర్భవతి. సో ఒప్పుకునే ఛాన్స్ లేదు. మరి జాక్వలిన్ ని ఓటు వేస్తారా లేక మార్పులు చేసి మరొక్క బాలీవుడ్ హీరొయిన్ ని దిగుమతి చేస్తారా అని సమాచారం, ఇదంతా తేలడానికి టైం పట్టేలా ఉందని చెబుతున్నారు.