సరికొత్త రికార్డు సూష్టించిన భారత ఓపెనర్లు!!

మొహాలీ వన్డేలో టీమిండియా ఓపెనర్లు రెచ్చిపోయారు . టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఈ సీరిస్ లో మొదటిసారి ఇద్దరు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి శతక భాగస్వామ్యం అందించారు దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల సరసన వీరు చేరిపోయారు.

వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యాల రికార్డు భారత మాజీ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీల పేరిట వుంది. వీరిద్దరు వన్డే ఓపెనర్లుగా 21 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. వీరి తర్వాత ఆసిస్ మాజీ ఓపెనర్లు గిల్‌క్రిస్ట్‌-మాథ్యూ హేడెన్‌ 16 సెంచరీలతో 2వ స్థానంలో నిలిచారు. వీరి తర్వాత స్థానాన్ని మొహాలీ మ్యాచ్ ద్వారా రోహిత్-ధావన్ 15 సెంచరీలతో జోడీ అక్రమించింది.