మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన దిల్ రాజు !
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ సినిమా విడుదలై తేదీ ఫై ఇటీవల రకరకాల వార్తలు వచ్చాయి.అందులో భాగంగా ఏప్రిల్ 5న లేదా 26న కాని ఈ చిత్రం విడుదలకానుందని వార్తలు వెలుబడ్డాయి. ఇక ఎట్టకేలకు ఈ విడుదల తేదీ ఫై క్లారిటీ వచ్చింది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఎఫ్ 2 చిత్రం విజయవంతమైన సందర్భంగా తిరుపతి కి వెళ్లి శ్రీవారిని దర్శించుకొని మీడియా తో మాట్లాడుతూ మహర్షి ఏప్రిల్ 25న విడుదలచేయనున్నామని తెలియజేశారు.
వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.