ఆ యంగ్ హీరో టార్చర్ చేసేవాడు – రెజీనా

మన టాలీవుడ్ అందాలతార రెజీనా నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసే ఆ అమ్మాయికి అవకాశాలు మాత్రం తక్కువగా వస్తున్నాయి అని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగులోని యూత్ హీరోల పక్కన నటించి తనకంటూ ప్రత్యేకంగా ఒక గుర్తింపు తెచ్చుకున్న క్రమంలోనే కొన్ని ఫ్లాప్స్ ఆమెని బాగా వెనక్కు నెట్టేశాయి అని మనకి తెలిసిందే. అవకాశాలు తకువావటంతో రెజీనా కొంతకాలంగా టాలీవుడ్ కి దూరమైంది. కోలీవుడ్లో తన హవా చూపిస్తున్నా రెజీనా తెలుగులో మాత్రం ఆమెకు ఇపుడు ఒకే ఒక ఆశ ఉంది.

అదే ఎవరు మూవీ. నటుడు అడవి శేషు హీరోగా రెజీనా, నవీన్ చంద్ర నటిస్తున్న ఈ మూవీలో తన పాత్ర గురించి వివరిస్తూ మంచి చాన్స్ ఇది అని రెజీనా తెలిపింది. ఈ అవకాశం దక్కడం తనఅదృష్టం అని కూడా మురిసిపోతోంది. ఈ నెల 15న మన ముందుకు వస్తున్న ఈ మూవీలో 80 శాతం తన మీదే సినిమా రన్ అవుతుందని కూడా రెజీనా వెల్లడించింది.

రెజీనా కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానని తాను అనుకుంటున్నట్లుగా కూడా అమె చెబుతోంది. అయితే ఈ మూవీ తనకు ఒక పెద్ద అనుభవం అని కూడా అంటోంది రెజీనా.

ఈ మూవీలో హీరో అడవి శేష్ తనని ఓ విధంగా బాగా టార్చర్ పెట్టాడని షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ అమ్మడు. ఆన్ స్ర్కీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా అడవిశేషు తనని బాగా వేధించాడు అని వివరిస్తూ అయితే వేరే విధంగా కాదని, పాత్ర బాగా రావాలని మాత్రమేనని ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ వేధింపులు ఫన్ గా మాత్రమే అని ఆమె అంటూ అలా హ్యాపీ మూడ్ లోనే సినిమా షూటింగ్ ముగిసిందని రెజీనా చెబుతోంది.

ఈ మూవీలో రెజీనా కి తన పాత్ర బాగుందని, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానని ఆమె స్పష్టంచేసింది. తను నటించే పాత్ర ముఖ్యమని, ఇక హిట్లు, ఫట్లు ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందేనని ఇ అమ్మడు వెల్లడించింది. తన వరకూ పాత్ర బాగుంటే హిట్ అనుకుంటానని చెబుతోంది రెజీనా. మొత్తానికి రెజీనాలో కొత్త ఆనందం స్పష్టంగా కనబడుతోంది. ఎవరు మూవీ హిట్ అయితే తెలుగులో మళ్ళీ రెజీనా రెచ్చిపోవడం ఖాయమని గుసగుసలువినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *