ఫాన్స్ కోసం జపాన్ వెళ్లనున్న రామ్ చరణ్..!

టాలీవుడ్ స్టార్స్ జపాన్లో తమ సినిమాలకు నెమ్మదిగా మార్కెట్ను పెంచుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత జపాన్లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న భారతీయ నటుడు ప్రభాస్. అతను బాహుబలి సినిమాలతో జపాన్ లో పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పొందాడు. ఇప్పుడు అదే విధంగా రామ్ చరణ్ కూడా జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పొందుతున్నాడు.

జపాన్కు చెందిన అభిమానులందరూ అతని పట్ల తమకు ఉన్న అభిమానం వ్యక్తం చేస్తూ రామ్ చరణ్ కి లేఖలను పంపారు.

తనకు గ్రీటింగ్ కార్డుల పంపిన అభిమానులందరికి థాంక్స్ చెపుతూ అతను ఫేస్ బుక్ పేజీలో ఈ విధంగా పోస్ట్ చేశాడు: “జపాన్ అభిమానుల నుంచి స్వీట్ సర్‌ప్రైజ్ అందుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. త్వరలో మిమ్మల్ని కలవాలని ఉంది అని రాంచరణ్ పోస్ట్ పోస్ట్ చేసాడు. #ThankYouJapan

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్సకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా జపాన్ లో విడుదల కాబోతుంది.