అఖిల్ సరసన నాని హీరోయిన్.!

ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న అఖిల్ తాజాగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తో ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా కోసం కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారనే ఆసక్తిని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ సమయంలో తాజాగా అఖిల్ జోడీగా ఒక అమ్మాయిని ఎంపిక చేసినట్లుగా మనకి తెలుస్తోంది. ఆ అమ్మాయి ఎవరో కాదు ఇంతకుముందే నాని సినిమా ‘గ్యాంగ్ లీడర్’లో చేస్తోన్న ‘ప్రియాంకా అరుళ్ మోహన్’. తన ఆకర్షణీయమైన రూపంతో ఇప్పుడిప్పుడే తమిళ కన్నడ ప్రేక్షకుల హృదయాలో చెరగని ముద్ర వేసింది ఈ సుందరి. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విడుదల తరువాత ఈ అమ్మాయి బిజీ అవ్వడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తూ ఉండటంతో ఆమెనే అఖిల్ జోడీగా తీసుకున్నారనేది తాజా తెలిసిన సమాచారం. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడవలసి వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *