‘కెజిఎఫ్’ డైరెక్టర్ తో సినిమా చేయనున్న టాలీవుడ్ స్టార్ హీరో..?

కన్నడ లో గతేడాది విడుదలైన ‘కెజిఎఫ్’ చిత్రం సంచలనం విజయం సాధించింది.  విడుదలైన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ లో డబ్బింగ్ చిత్రాలలో నాన్ బాహుబలి రికార్డ్ కూడా అందుకుంది. ఒక కన్నడ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ రావడం ఇదే మొదటిసారి. కన్నడ పాటు, హిందీ, తెలుగు మరియు తమిళ భాషలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం హీరోనిఎలివేట్ చేస్తున్నట్టే ఉంటుంది. ముఖ్యంగా హీరోని ఎలివేట్ చేసే విషయంలో ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్..సౌత్ దర్శక ధీరులు రౌజమౌళి, శంకర్‌తో పోటీ పడ్డాడంటే అతిశయోక్తి కాదు.

దీంతో అన్ని పరిశ్రమల్లోని నిర్మాతలు ప్రశాంతి నీల్‌ డైరెక్షన్లో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు.  వారిలో తెలుగు నిర్మాతలు కూడా ఉన్నారు.  వారే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు.  వీరు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమాని సైన్ చేయించినట్టు సమాచారం అందుతోంది.  అయితే ఆ సినిమా ఏ హీరోతో ఉంటుంది, ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉండబోతుంది అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.  ఒకవేళ ప్రాజెక్ట్ నిజమైతే అందులో హీరోగా పవర్ స్టార్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లేదా మహేష్ బాబు వీరిలో ఒకరు ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ఛాఫ్టర్ 2 తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. బహుశా అది పూర్తయ్యాక తెలుగు ప్రాజెక్ట్ మొదలుకావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *