షాక్ : లీకైన ‘సాహో’ టీజర్..!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సాహో టీజర్ 13, జూన్ విడుదల కాబోతుంది!

అయితే సాహో టీజర్ ఇంటర్నెట్లో విడుదలైందని అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వీడియో ఫుటేజ్ అయితే ఏమి బయటికి రాలేదు అంటే ఇది పుకార్లు మాత్రమే అని అర్థమవుతుంది.

ఇంతవరకు, సాహో మేకర్స్ నుండి అద్భుతమైన పోస్టర్లను, షేడ్స్ ఆఫ్ సాహో ఎపిసోడ్లను విడుదల చేశారు. ఇప్పుడు, జూన్ 13 న చిత్రం యొక్క టీజర్ను విడుదల చేస్తామని నిర్మాతలు ధృవీకరించారు.

టీజర్ నిడివి 1నిమిషము 40 సెకండ్లు ఉంటుందని సమాచారం, టీజర్లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ తదితరులు మనకు కనిపిస్తారు.

ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ చిత్రంలో విలన్ గా కనిపించనున్నాడు. హాస్యనటుడు వెన్నెల కిషోర్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.

సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు, యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. సినిమాని మోహన్ సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *