జెన్యూన్ రివ్యూ : సాహో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ల జోడీతో యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో.  350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ :

సాహో సినిమా స్టోరీ ఏంటంటే,  తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలిపే ఒక పాయింట్ ని తీసుకుని దర్శకుడు సుజిత్ తెరకెక్కించడం జరిగింది. మొదట, హీరోని తప్పుగా అర్ధం చేసుకున్న హీరోయిన్, ఆ తరువాత కొన్ని ఘటనల వలన అతడు మంచివాడని తెలుసుకుని, అతడితో కలిసి ఒక పెద్ద రాబరీ వెనుక మిస్టరీని తెలుసుకునేందుకు ముందుకు సాగుతుంది. అయితే వారి వెతుకులాటలో మరికొన్ని ఊహించని పరిణామాలు ఎదురు కావడం, అలానే  హీరో తండ్రి గురించి తెలియడం, ఆపై ట్విస్టులు రివీల్ అవుతూ సినిమా సాగుతుంది. ఇక క్లైమాక్స్ లో అద్భుతమైన ట్విస్ట్ తో సినిమా ముగుస్తుంది.

ఈ సినిమాలో హీరో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్, ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే భారీ ఫైట్ సీన్, అలానే ప్రీ క్లైమాక్స్ ముందు జరిగే భారీ ఛేజింగ్ తో కూడిన యాక్షన్ సీన్, క్లైమాక్స్ ట్విస్ట్, మొత్తంగా ఇవే సినిమాలో ప్రధాన హైలైట్స్ గా నిలుస్తాయి.

అంతేకాక సినిమాలో మధ్యలో వచ్చే సాంగ్స్ ఆడియన్స్ కి మంచి రిలీఫ్ ఇస్తాయి. సినిమాలో ప్రభాస్, శ్రద్దల జోడి అదిరిపోయింది ఫైట్స్ మరియు యాక్షన్ సన్నివేశాలలో ప్రభాస్ మరొక్కసారి తన మార్క్ తో దూసుకెళ్లాడని అంటున్నారు. జీబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

ప్రభాస్
యాక్షన్ సన్నివేశాలు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
విజువల్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ
సినిమా నిడివి ఎక్కువ కావడం

తీర్పు :

ఓవర్ అల్ గా ఈ సాహో సినిమా ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్  అని, నార్మల్ ఆడియన్స్కి ఒక్కసారి చూడదగ్గ చిత్రమని  అనిపిస్తుంది.

రేటింగ్ 2.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *