పవన్ సమక్షంలో జనసేన లో చేరిన నాగబాబు!!

పవన్ కళ్యాణ్ సోదరుడు, నాగబాబు జనసేన పార్టీలో చేరారు. పవన్ కల్యాణ్ అన్న నాగబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ నాగబాబు చేస్తారని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన తరఫున నాగబాబును పోటీకి దించుతున్నామని ప్రకటించారు. ”కుటుంబ సభ్యులను దొడ్డిదారిన కాకుండా రాజమార్గంలో ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి బరిలోకి దింపుతున్నాం. నా పిలుపు మేరకు పార్టీకి వచ్చిన నాగుబాబుకు ధన్యవాదాలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
- 2023 లో అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 10 తెలుగు సినిమాలు
- AP లో అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు
- అడిపోరుష్ టికెట్ ధర 112 రూపాయలకు వస్తుంది!
- విజయవాడలో హై ఎలిట్యూడ్ బెలూన్ ఉపగ్రహం ప్రారంభించబడింది
నాగబాబు మాట్లాడుతూ, తన సోదరుడు మంచి వ్యక్తిత్వం ఉన్న వారని చెప్పుకోచారు. నాకు పవన్ సోదరుడైనప్పటికీ తనే నాకు నాయకుడు అని, పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఏమి చేయమన్న చేస్తాను అని పవన్ స్ఫూర్తితో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని చెప్పారు.