విద్యార్థుల జీవితాలతో అడుకోవద్దు – పవన్ కళ్యాణ్

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది , దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సిందే అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు,

విద్యార్థుల జీవితాలతో అడుకోవద్దు – పవన్ కళ్యాణ్

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చడం దారుణం , ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసాక 17 మంది విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడటం చాలా బాధాకరం , ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి ,

పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ , నుండి ఫలితాల వెల్లడి వరకు విద్యార్థులలో అలాగే వారి తల్లితండులకు చాలా అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేసి, నిజాలు బయటపెట్టాలి , అంటూ పేర్కొన్నారు అలాగే విద్యార్థులకు కూడా ఒక సందేశాన్ని పంపారు.

ఆత్మహత్యలకు పాల్పడొద్దు :

జీవితం విలువైనది , ఈ ఫలితాలతో నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడొద్దు విద్యార్థులకు జనసేన అండగా ఉంటుంది , అలాగే చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలి, ఇన్ని తప్పిదాలకు కారణం అయిన బోర్డ్ సభ్యులకు, మరియు సాఫ్ట్ వెర్ సంస్థ పై కఠిన చర్యలు తీసుకొని అలాగే న్యాయ విచారణకు అదేశించాలి .. అంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు…

మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.