సైరా టీజర్ లోనే కాదు, సినిమాలో కూడా మెరవనున్న పవర్ స్టార్.!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చలనచిత్రం ‘సై రా నరసింహారెడ్డి’. ఈ చిత్రంలో స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కినది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు మెగాస్టార్ అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి ఈ సినిమాకి సంబంధించి ఏ వార్త బయటకొచ్చినా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవితున్నది మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా అలాంటిదే మరొక్క వార్త మెగాస్టార్ అభిమానులను ఒక్కసారిగా సంబరాలు చేసుకునేలా చేస్తోంది. సైరా నరసింహారెడ్డి మూవీ కోసం మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు అన వార్త అంతర్జాలంలో చెకర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకొచ్చాయి.

అయితే పవన్ వాయిస్ ఓవర్ చెప్పింది సైరా సినిమాలోని సన్నివేశాల కోసం కాదని, అవి కేవలం టీజర్ కోసమే పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇటీవల సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసిన చిత్రబృందం త్వరలోనే ‘సై రా’ టీజర్ ని విడుదల చేయడానికి శిఫమవుతినట్లు సమాచారం. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయబోతున్నారు అని చిత్ర బృందం వెల్లడించింది.