పవన్, మహేష్ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా.!

మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో నెంబర్ వన్ గేమ్ పవన్-మహేష్ మధ్య నువ్వా నేనా అన్నట్టు గా పోటీ సాగుతోంది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం తో టాలీవుడ్ ఇండస్ట్రీలో సీన్ మొత్తం రివర్స్ అయింది. వీరిద్దరి సినిమాలు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం మరియు పండగ వాతావరణం ఉండేది. అలాగే వీరికి సంబంధించిన సినిమా విడుదల అవుతుందంటే చాలు ఇద్దరు హీరోల అభిమానులు ఎప్పుడెప్పుడా అని సినిమా హాల్ దగ్గర పడిగాపులు కాస్తుంటారు అని మనఅందరికి తెలిసిన సంగతే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోకి ఉండదు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్-మహేష్ బాబు ఒకే వేదికపై కనబడునట్లు సినిమా ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంతున్నాయి.

ఇక అసలు విషయం లోకి వెళ్తే తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాంగా సెప్టెంబర్ 8న రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు అని వెల్లడించారు. దీనికి కర్టెన్ రైజింగ్ ప్రెస్ మీట్ ని కూడా టి సుబ్బిరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. రాజశేఖర్, సి కళ్యాణ్, సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్ లాంటి సినీ ప్రముఖులు ఈ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు అని స్పష్టంచేశారు. సెప్టెంబర్ 8న జరిగే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

సినీవర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే నిర్వాహకులు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుని కలసి వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరి ఈ ఇద్దరూ కలిసి ఈ వేడుకకు హాజరైతే మాత్రం కచ్చితంగా ఈ వేడుక టాలీవుడ్ హిస్టరీ లోనే ఒక చరిత్రాత్మకమైన వేడుకగా నిలిచిపోతుందని ఇండస్ట్రీకి చెందిన వారు వారు చెబుతున్నారు. మొత్తంమీద చూసుకుంటు పోతే ఇప్పుడిప్పుడే టాప్ హీరోలు ఒక సినిమా హీరో ఫంక్షన్లకు ఒకరు వెళ్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్, మరియు మహేష్ బాబు కలిసి ఈ వేడుకకు హాజరు కావడం అంటే ఇండస్ట్రీలో హీరోల మధ్య మంచి వాతావరణం ఉంది అనే సమాచారం దీనిద్వారా స్పష్టంగా తెలుస్తోంది. దీనిద్వారా అభిమానుల మధ్య గొడవలు ఉండవు అని చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *