షూటింగ్’లో స్టార్ హీరోయిన్ కి గాయాలు.!

సినిమా పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు హీరోలకి గాయాలు అవ్వడం ఎక్కువగా మనం వింటుంటాం.   తాజాగా  పరిణీతి చోప్రా షూటింగ్ సమయంలో గాయాలపాలైంది. ప్రస్తుతం తను సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైనా’. ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ గా నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో పరిణీతి గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. డాక్టర్స్ సలహా మేరకు పరిణితి రెస్ట్ తీసుకుంటుంది. తను కోలుకున్న తరువాత  బాడ్మింటన్ ఆడడానికి మళ్లీ సిద్ధపడతానని సోషల్ మీడియా లో తన అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందిస్తుండగా,  అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. భూషణ్ కుమార్ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నాడు, ఈ చిత్రం 2020 లో విడుదల కానుంది.