మహానాయకుడు ట్రైలర్ వర్సెస్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ !

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఒకే సారి రెండు బయోపిక్లు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి క్రిష్ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు కాగా వివాదపాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్. అయితే ఈ రెండు చిత్రాలకు చాలా డిఫ్రెన్స్ వుంది. ఎన్టీఆర్ మహానాయకుడు లో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి చూపెడుతుండగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలో వచ్చిన తరువాత జరిగిన సంఘటనల ఆధారంగా తెరక్కుతుంది.

ఇక ఈ సినిమాల ట్రైలర్ల విషయానికి వస్తే ఇటీవల విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఊహించని రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా ఫై అంచనాలను పెంచింది. ట్రైలర్ లో ఎన్టీఆర్ జీవితాన్ని చాలా రియలిస్ట్ గా చూపెట్టాడు వర్మ. ఇక కొద్దీ సేపటి క్రితం విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ మాత్రం మొదటి పార్ట్ లాగానే సినిమాటిక్ గా వుంది. ట్రైలర్ లో ఇంట్రస్ట్ అనిపించే సన్నివేశాలు ఒక్కటి కూడా లేవు. ఇక అసలే మొదటిభాగం ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో ఈ సెకండ్ పార్ట్ ఫై ఎవరికి పెద్దగా అంచనాలు కూడా లేవు. దానికి తోడు తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సాదాసీదాగా వుంది. ఇక సినిమాలో కూడా ఎన్టీఆర్ కు ఎక్కడా ఎదురులేనట్లుగా చూపెడితే మాత్రం ఈ చిత్రం కూడా మరో ఎన్టీఆర్ కథానాయకుడు అవ్వడం ఖాయం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *