‘ఎన్టీఆర్ మహానాయకుడు’ మూవీ రివ్యూ : Mana Telugu Nela

NTR Mahanayakudu review

మూవీ రివ్యూ: ఎన్టీఆర్ మహానాయకుడు


ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది, హాలీవుడ్, బాలీవుడ్ లో ముందు నుండే బయోపిక్స్ ట్రెండ్ ఉండగా దక్షిణాదిన మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య ఆ ట్రెండ్ ఊపందుకుంది, మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మహానటి పెద్దగా హడావుడి ఏమీ లేకుండా విడుదలై అనూహ్య విజయం సాధించింది. ఆ సినిమా సాధించిన విజయం పలు రాజకీయ, సినీరంగానికి చెందిన ప్రముఖుల బయోపిక్ కు ఆజ్యం పోసింది. నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మ గౌరవ పరీక్షకుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “ఎన్టీఆర్ బయోపిక్” కూడా అదే కోవకు చెందుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఈ సంక్రాంతి సందర్బంగా విడుదలైన సంగతి తెలిసిందే, క్రిటిక్స్ నుండి మంచి రివ్యూస్, ఆడియెన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, వివిధ కారణాల వల్ల కధానాయకుడు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేక పోయింది. కథానాయకుడు సినిమాకు సీక్వెల్ గా మహానాయకుడు ఈరోజు పెద్ద ఎత్తున విడుదలైంది, కథానాయకుడు రిజల్ట్ ఆధారంగా తగు జాగ్రత్తలు తీసుకొని రీ షూట్లు చేసి మహానాయకుడు సినిమా సిద్ధం చేసి విడుదల చేసారు. మరి మహానాయకుడు ఏ విధంగా ఉందొ ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
మహానాయకుడు కథ విషయానికి వస్తే, ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుండి ఆయన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన తెచ్చిన మార్పు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులను ఎమోషన్ జోడించి చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.

విశ్లేషణ:

ముందుగా అందరూ ఊహించినట్టే మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో ఉన్న వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళలేదు. సినిమా ఆద్యంతం ఎన్టీఆర్ గొప్పతనాన్ని చాటటానికే ప్రయత్నించారు, ఈ క్రమంలో కొన్ని కల్పిత సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపించాయి. సినిమా కథను వాస్తవానికి కాస్త దూరంగా, చంద్రబాబుకు అనుకూలంగా, వచ్చే ఎన్నికల్లో బాబుకు రాజకీయంగా మైలేజ్ ఇచ్చేలా చిత్రీకరించారు. ముందుగా ఊహించినట్టే ఇందులో నాదెండ్ల భాస్కర్ రావును విలన్ గా చూపించారు. ఇక నటన విషయానికొస్తే ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ మెప్పించాడు, ఎక్స్ప్రెషన్స్ పలికించటంలో ఎన్టీఆర్ ను దించేసాడు బాలకృష్ణ. చంద్రబాబు పాత్రలో రానా పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు, కొన్ని సీన్లలో రానా నటన హైలైట్ గా నిలుస్తుంది. బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది, సెంటిమెంట్ సీన్లలో ఆమె నటన కంట తడి పెట్టించింది. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేసింది. స్లో నెరేషన్ వల్ల అక్కడక్కడా సినిమా సాగదీసినట్లు అనిపిస్తుంది.
[penci_ads id=”penci_ads_1″]
ప్లస్ పాయింట్స్:

బాలకృష్ణ
విద్యాబాలన్
సంగీతం

మైనస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే
క్లైమాక్స్

తీర్పు:

మొత్తానికి మహానాయకుడు సినిమా చంద్రబాబుకు పొలిటికల్ మైలేజ్ ఇవ్వటం కోసమే తయారు చేసిన స్క్ర్పిట్ లాగా అనిపిస్తుంది. చాలా సీన్లు వాస్తవానికి దూరంగా ఉండటంతో కల్పిత కథ లాగే అనిపిస్తుంది తప్ప బయోపిక్ లాగా ఏ కోశానా అనిపించదు. కథానాయకుడుతోనే నిరాశ పరిచిన క్రిష్ అండ్ టీం మహానాయకుడితో మరోసారి నిరాశ పరిచింది.

రేటింగ్: 2.25/ 5

“బాటమ్ లైన్: “ఎన్టీఆర్ మహానాయకుడు” – బయోపిక్ కాదిది, బాబుగారి స్క్రిప్ట్ ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *