‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో అల్లు అర్జున్ హీరోయిన్..!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అని చిత్రపరిశ్రమలో చెప్పుకుంటున్నారు. ప్రపంచంలొనే చెప్పుకోదగిన సినిమాలలో బాహుబలి నిలిచింది. బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న భారీ చిత్రం కావడంతో భారీ అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు.అయితే ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్‌కు సరసన జోడిగా నటిస్తున్న డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ కుటుంబ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకుందని చెబుతున్నారు.

కాస్టింగ్ విషయంలో ఎన్నో ప్రత్యేక జాగ్రతలు తీసుకునే రాజమౌళికి ఎమ్ చేయాలో అర్థంకాలేదు. దీంతో మరో హీరోయిన్‌ను వెతికే పనిలో ఉన్నారని చిత్రయూనిట్ చెబుతోంది. అదే సమయంలో మన సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐన నిత్యమీనన్‌కు రాజమౌళి నుంచి ప్రత్యేక పిలుపు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది.

త్వరలోనే హైదరాబాద్‌లో నిత్యకు ఫస్ట్ లుక్‌ టెస్ట్ నిర్వహించనున్నారట చిత్ర యూనిట్ నుండి బలంగా వినిపిస్తున్నాయి. మరి నిత్య నటించబోయేది ఎన్టీఆర్‌ జోడిగానేనా లేక మరో పాత్రా అన్న విషయం తెలియాల్సి ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ కి తగిలిన గాయం కారణంగా ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. ఈ జులై 30, 2020 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.