నిష అగర్వాల్ నిర్ణయంతో షాక్ అయిన కాజల్ అగర్వాల్..!

అందాల తార కాజల్ టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా పెరు పొందింది. బాలీవుడ్ లోనూ ఒక మెరుపు మెరిసింది. ఆమె చెల్లులు నిషా అగర్వాల్ మాత్రం హీరోయిన్ గా పెద్దగా రాణించలేకపోయింది. ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఒక్కటి కూడ పడలేదు. చెప్పుకోవాలంటే ఓ మోస్తారుగా ఆకట్టుకొంది. ఐతే, అక్క కంటే ముందే పెళ్లి చేసుకొని సంసార జీవితంలోకి అడుగుపెట్టింది నిషా. ప్రస్తుతం ఆమెకి కొడుకు కూడా పుట్టాడు. ఆ బుడ్డోడుతో కాజల్ ఆడు కుంటోన్న పలు ఫోటోలు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ గా మారాయి. ప్రస్తుతం లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? నిషా రీ-ఎంట్రీ ఇవ్వబోతుందట. ఈ నిర్ణయంతో కాజల్ షాక్ కి గురైంది అంటా..

నిషా మళ్లీ హీరోయిన్ వేషాలు వేస్తుందా.. ? అక్కా, వదిన. లాంటి పాత్రల కోసం రెడీ అవుతుందా.. ? అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం నిషా అందాలు పెంచే పనిలో ఉందని తెలిసింది. నిషా స్లిమ్ గా మారడానికి కసరత్తులు చేస్తుందట. ఆమె పడే కష్టం చూస్తుంటే.. కచ్చితంగా మళ్లీ హీరోయిన్ గానే రీ ఎంట్రీకి ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్లు సైతం పెళ్లి తర్వాత ఇంటికే పతిమితమైయ్యారు. మరీ.. అంతగా క్రేజ్ లేని నిషా రీఎంట్రీతో హీరోయిన్ గా రాణిస్తుందేమో చూడాల్సిందే.