ప్రివ్యూ : NGK (సూర్య, రకుల్, సాయి పల్లవి)

హీరో సూర్య, డైరెక్టర్ శ్రీ రాఘవ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ ప్రపంచవ్యాప్తంగా మే 31, 2019 న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మరియు పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో సూర్య ..అతి సామాన్యమైన వ్యక్తి పాత్రలో నటించాడు. అలాంటి సామాన్యమైన వ్యక్తి రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేసాడనేదే ఈ సినిమా స్టోరీ. సినిమా మొత్తం రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

సమాజం పైన ప్రేమ, సమాజం కోసం ఏదైనా చేయాలనుకునే వ్యక్తి తన చుట్టూ జరిగే అన్యాయాలని ఎదిరించడానికి రాజకీయాలలో ఎలా అడుగుపెడతాడు. ఒక చిన్న  గుంపును వేసుకొని రాజకీయాల్లో వచ్చేస్తే..నిన్ను రానిస్తారనుకున్నవా ? అన్న డైలాగుతో బడా రాజకీయ నాయకులు సూర్య ని బెదిరించాలని చూసిన నేతలపైనా సూర్య ఎలా ఎదిరించే సన్నివేశాలు ఆడియన్స్ ని ఆకట్టుకునేలగా ఉంటాయని టాక్. సినిమా లో సూర్య నటన హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. సెల్వా రాఘవన్ ప్రతి సన్నివేశాలను మన చుట్టూ జరిగే పరిస్థితులను గుర్తుకు తెచ్చేలాగా తీర్చిదిద్దాడు అని సమాచారం.

ఈ సినిమాలో యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుందని, సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్స్‌గా వారి పాత్రల మేరకు మెప్పించారు. డ్రీమ్ వారియర్ సంస్థ ఈ భారీ బడ్జెట్ మూవీ ని ప్రతి ప్రేమ్ రిచ్ గా తీర్చిదిద్దారు. ఈ సినిమాతో సూర్య హిట్టు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.