పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కేసీఆర్ కుట్ర : నారా లోకేష్

Nara lokesh

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని కొలనుకొండ, వడ్డేశ్వరం, ఇప్పటం గ్రామంలో ఆయన రోడ్ షో నీ ర్వహనలో మాట్లాడుతూ తెదేపా ను ఓడించి పోలవరం ప్రాజెక్టును అపించవచ్చన్నది కేసీఆర్ వ్యూ హమని ఆరోపించారు.

జగన్ 28 కేసులు ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉన్న జగన్ కి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని అడుగుతున్నారు. ఇలాంటి వ్యక్తి కి రాష్ట్ర తాళాలు ఎలా అప్పగిస్తాం. మీరూ తీసుకొనే నిర్ణయం మీదే ఐదుకోట్ల ఆంధ్రుల భవిష్యత్ ఆధారపడి వుంది. రాష్ట్రంలో జగన్, కేసీఆర్ మరియు మోడీ కుట్రలు పడుతున్నారు. ప్రజలు భారీ మెజారటీతో నన్ను గెలిపించండి. మీ మధ్యే ఉంటా.. మీ సమస్యలు తీరుస్తా. దేశంలో ఆదర్శ నియోజకవర్గగా మంగళగిరి ని తిర్చిద్దిదుతా అని హామీఇచ్చారు.
ఎంఎస్ఎం ఈ పార్కు ప్రతి నియోజకవర్గం ఒకటి ఉండాలన్నారు. సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటు తోనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని నియజకవర్గాల్లోనూ ఎంఎస్ ఎం ఈ పార్కులు ఎర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రజలకోసం భవిష్యత్ లో మరిన్ని పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *