సినిమా రివ్యూ : జెర్సీ (నాని)

ఎలా మొదలెట్టాలి.., ఎక్కడి నుండి మొదలెట్టాలి తెలియని పరిస్థితిలో పడేసింది జెర్సీ సినిమాలోని ఎమోషన్….

ఎమోషనల్ సీన్స్ లో నాని నటన గురించి చెప్పటానికి మాటలు కరువయ్యాయి…

తెలుగులో నటించిన తొలి సినిమాతోనే తన సత్తా చాటింది శ్రద్ధా, ఒకటి రెండు సీన్స్ లో అయితే నాని ని డామినేట్ చేసింది అనటంలో ఎలాంటి సందేహం లేదు…

మళ్ళీ రావా సినిమాతోనే గౌతమ్ తున్ననురి తనలో విషయం ఉందని ప్రూవ్ చేసుకున్నప్పటికీ…, సో కాల్డ్ మెచ్యుర్డ్ ఆడియన్స్( ఆరవ సినిమాలను నెత్తిన పెట్టుకొని, తెలుగు సినిమాలను చిన్న చూపు చూసే కళా పిపాసులు) గుర్తించలేదు…. ఇప్పుడు జెర్సీ సినిమాతో వారందరికీ గూబ గుయిమనే సమాధానం ఇచ్చాడు, ఈ సినిమాలో ఒక్క రైల్వే స్టేషన్ సీన్ చాలు గౌతమ్ ప్రతిభ ఏంటో చెప్పటానికి…. స్టోరీలో ఎంత ఎమోషన్ ఉందో డైలాగ్స్ లో కూడా అంతే ఎమోషన్ క్యారీ అయ్యేలా చూసుకున్నాడు దర్శకుడు.

అనిరుధ్ సినిమాలోని ఎమోషన్ కి తగ్గ సంగీతం అందించాడు, కొన్ని కొన్ని సీన్స్ అనిరుధ్ నేపథ్య సంగీతం ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళింది…

80,90ల నాటి ఫీల్ ని క్యారీ చేయటంలో సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కీలక పాత్ర పోషించాయి…

సత్యరాజ్, హీరో ఫ్రెండ్స్ గా నటించిన ప్రవీణ్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు, నాని కొడుకుగా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ లోని క్యూట్ నెస్ చాలా సీన్స్ కి బాగా హెల్ప్ అయ్యింది….

అక్కడక్కడ స్లో నేరేషన్ తప్పించి, చెప్పటానికి పెద్దగా మైనస్ లు ఏమి లేవు…

“మొత్తానికి జెర్సీ మనసును హత్తుకునే సినిమా, బండబారిన గుండెలను సున్నితంగా స్పృశించే సినిమా….”

నా వరకు… నాకు ఈ మధ్య కాలంలో వచ్చిన గుర్తుండిపోయే, క్లాసిక్ సినిమాలు అంటే…. జెర్సీ, మజిలీ, కేరాఫ్ కంచరపాలెం, మళ్ళీ రావా, చందమామ కథలు

#jersey #jerseymoviereview

రేటింగ్ 3.75/5

Written by The GR Writings!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *