బాలయ్య గురించి నాగబాబు అప్పుడు అలా ఇప్పుడు ఇలా

balayya,nagababu comments,nagababu comments on balakrishna, pawan kalyan,

మెగా బ్రదర్ నాగబాబు ఆ మధ్య వార్తల్లో బాగా నిలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడుతూ తనదైన శైలిలో విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు నాగబాబు, మెగా బ్రదర్ జోలికి ఎవరు వచ్చిన ముందు స్పందించే వారిలో నాగబాబు, బహిరంగంగా బయటకు చెప్పటం నాగబాబు నైజం, ఆ మధ్య కాలంలో బాలయ్య బాబు ఎవరో తెలియదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు, 

సినిమా పెద్దలు షూటింగ్స్ కు అనుమతులు అడిగే సమయంలో బాలకృష్ణను ఆహ్వానించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ విషయంలో కూడా నాగబాబు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి నందమూరి బాలయ్య గురించి, సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగబాబు,తాజాగా…. పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఒక పాత ఫోటోని ఇన్‌‌‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి…’ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి, నా దగ్గర దాచానంతే…! అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆతర్వాత  మరో ఫోటోను షేర్ చేసాడు నాగబాబు ఆ ఫోటోలో నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. దానికి క్యాప్షన్ గా.. ఒకరు సొంత తమ్ముడు.. మరొకరు బ్రదర్ ఫ్రమ్ అనేదర్ మధర్ .. అని రాసుకొచ్చాడు . అలాగే పవర్ స్టార్, నందమూరి సింహాన్ని కలిసిన రోజుది ఈ ఫోటో అని పేర్కొన్నాడు. ఒకప్పుడు తెలియదు అన్న నాగబాబు ఇప్పుడు బాలయ్య బాబు గురించి ఫోటో షేర్ చేయటంతో,ఈ ఫోటో వైరల్ గా మారింది..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *