నాగబాబు కి కరోనా అంటూ వచ్చిన వార్తలపై నాగబాబు క్లారిటీ

నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో ఓ పుకారు షికారు చేసింది. యూట్యూబ్ ఛానళ్లలో రెచ్చిపోయి పోటీపడి మరీ హెడ్డింగులు పెట్టారు. ‘నయం కాని వ్యాధికి గురైన నాగబాబు. భయాందోళనలో మెగా కుటుంబం’ అని ఒకరు థంబ్‌నైల్ పెడితే… ‘నాగబాబుకు తగులుకున్న వైరస్. నిహారికకి టెన్షన్ టెన్షన్’ అని ఇంకొకరు థంబ్‌నైల్ పెట్టారు. ‘మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం. ఆందోళనలో అభిమానులు’ అని మరో యూట్యూబ్ ఛానల్ థంబ్‌నైల్ పెట్టింది. నాగబాబు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న కామెడీ షోలో ఒక పార్టిసిపెంట్ కి కూడా కరోనా వచ్చిందని పుకార్లలో పేర్కొన్నారు.

కరోనా వైరస్ సోకిందనే వచ్చిన వార్తలపై నాగబాబు స్పందించారు. ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదని భయపెట్టవద్దని ఆయన యూట్యూబ్ ఛానళ్లకు సూచించారు. ఇంతకు ముందు కంటే చాలా ఎనర్జిటిక్ గా ఉన్నానని నాగబాబు తెలిపారు. ఇదంతా థంబ్‌నైల్స్ మహిమ అని పేర్కొన్నారు. “క్రేజీ ఐడియా వచ్చింది. థంబ్‌నైల్స్ మీద ఒక వీడియో చేస్తాను” అని నాగబాబు తెలిపారు. ఆయనకు ‘నా ఛానల్ నా ఇష్టం’ యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి తెలిసిందే. తన అభిప్రాయాలను అందులో వ్యక్తం చేస్తూ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *