ఇద్దరి మధ్య ఏమి ఉందని అడుగుతున్నారు: నాగ శౌర్య

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య‌, మెగా ప్రిన్సెస్ నిహారిక గ‌తంలో వీరిద్దరు కలిసిఒక మ‌న‌సు సినిమాలో న‌టించిన సంగతి తెలిసిందే. సినిమా మొదలైనప్పటి నుండి నాగ శౌర్య, నిహారిక ల గురించి మీడియాలో గ్యాసిప్‌లు వైరల్ అయ్యాయి. వీరిద్ద‌రూ ప్రేమలో ఉన్నారని, మరికొద్ది రోజుల్లో పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను అప్ప‌ట్లోనే వీరిద్ద‌రూ ఖండించారు. అయినా ఇప్ప‌టికీ ఆ వార్త‌లు ఆగ‌డం లేదు.

తాజాగా నాగ శౌర్య ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇంట‌ర్వ్యూ లో నిహారిక‌తో ప్రేమ వార్త‌ల గురించి స్పందించాడు. నేను, నీహారిక పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు వార్త‌లు తెగ రాస్తున్నారు అని నిజానిజాలు తెలియకుండానే గాస్సిప్స్ క్రియేట్ చేయడం చాలా పెద్ద తప్పు అని గాసిప్స్ రాసేటప్పుడు ఒకసారి వాళ్ల గురించి కూడా ఆలోచించాలని కోరారు. ఈ ప్ర‌చారం ఎక్క‌డి వ‌ర‌కు వెళుతుందో, ఎక్క‌డ ఆగుతుందో అర్థం కావ‌డం లేదు. అలాగే నాగశౌర్య మాట్లాడుతూ రెండ్రోజుల క్రితం నా ఫ్రెండ్స్ ఫోన్ చేసిమీ ఇద్ద‌రి స్టోరీ ఏమి ఉంది?అని అడిగారు. నేను ఆ మాట వినగానే షాక‌య్యా నేను, నిహారిక ప్రేమించుకోవడం లేదు, అలాగే నేను ఏ హీరోయిన్‌తోనూ డేటింగ్‌లో లేన‌ని నాగ‌శౌర్య స్ప‌ష్టం చేశాడు.

ఇంత స్పష్టంగా చెప్తున్నా నాగ శౌర్య, నిహారికల పైన గాసిప్స్ ఆగటంలేదు. ఏది ఏమైనా నిప్పు లేకుండా పొగ రాదు అంటున్నారు నెటిజెన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *