కొడుకు ‘గే’ అని.. సంతానం కోసం ఓ తల్లి చేసిన పని…

ఓ అమ్మ తనకి కొడుకు పుట్టగానే ఎంతో ఆనందపడింది. వంశాన్ని నిలబెట్టే వాడు అవుతాడు అని ఎంతో ఆశపడింది. కానీ తన కొడుకు యుక్త వయస్సు వచ్చి పెళ్లి చేసిన తరువాత తన కొడుకుకి సంతానం ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు. చివరికి తన కొడుకు ఒక గే అన్న వార్త ని తెలుసుకొని ఆ తల్లి చాలా బాధపడింది. కానీ ఒక నిర్ణయానికి వచ్చింది.ఆమె నిర్ణయం తెలుసుకున్న అందరు విస్మయాం చెందారు . తనకి పుట్టిన కొడుకు బిడ్డ ఉండాలి అని ఆమె మళ్లీ తల్లిగా మారింది. ఇది వార్త అమెరికాలోని నెబ్రస్కాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.


పూర్తి విషయం లోకి వస్తే … 61 ఏళ్ల సెసిలె ఎలెగ్ తన కొడుకు మేథ్యూ ‘గే’అవడం తో. తను ఇలియట్ డౌఘెర్టీ అనే మరో పురుషుడిని పెళ్లి చేసుకున్నాడు. కాగా.. వీరిద్దరూ తమకు సంతానం పొందాలి అని భావించారు. కానీ అది అసాధ్యం అని వాళ్లకూ తెలుసు.

ఈ విషయాన్ని మెథ్యూ తన తల్లితో చెప్పాడు. దీనితో వారు వెంటనే వైద్యులను సంప్రది విషయం తెలుసుకున్నారు. వాళ్లు ‘గే’ జంట పిల్లలను కనడం అసాధ్యమని చెప్పడం వలన తన తల్లి సరోగసీ విధానంలో బిడ్డను కన్నాలి అని ఆమె ముందు కి వచ్చింది అయితే, అప్పటికే ఆమెకు 61 ఏళ్లు పూర్తిగా నిండాయి. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అది సాధ్యమేనని చెప్పారు.


దీంతో వైద్యులు మెథ్యూ నుంచి స్పెర్మ్‌ను, అతని భర్త ఇలియట్ సోదరి నుంచి అండాన్ని సేకరించి ఆమె గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. తొమ్మిది నెలల నిండిన తర్వాత ఆమె ఒక ఒమాహాలోని నెబ్రస్కా మెడికల్ సెంటర్‌లో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇలా ఒక 61ఏళ్ళు నిండిన ఒక మహిళ సరోగసి విధానంలో జన్మనివ్వడం ప్రపంచంలో ఇదే తొలిసారి.ఆమె తన కొడుకు బిడ్డ పొందాలి అని అలా చేసింది..

Written by Karthik!!

  • 4
    Shares