మన్మథుడు 2ఫ్యామిలీని చూడండి – నాగార్జున

Manmadhudu 2 cast and crew, Manmadhudu 2 Trailer, Manmadhudu 2 Latest News, Manmadhudu 2 Release date, Manmadhudu 2 Songs, Manmadhudu 2 Videos, Manmadhudu 2 News, Nagarjuna Manmadhudu 2,

అక్కినేని నాగార్జున హీరోగా చేస్తున్న మూవీ ‘మన్మథుడు 2’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సెట్‌లో తీసిన ఓ ఫోటో ని నాగార్జునగారు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నేను, నా ‘మన్మథుడు 2′ కుటుంబం.. లవింగ్‌ ఇట్‌’ అంటూ లవ్‌ సింబల్‌ను పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోని చూస్తుంటే నాగ్‌, రకుల్‌ప్రీతి సింగ్ జంట చక్కగా గా ఉన్నారు. నాగార్జున మాత్రం కొత్త లుక్‌లో చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు.ఈ చిత్రం దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తోపాటు రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి తదితరులు ఫొటోలో కనిపిస్తున్నారు. ఇదే విధంగా తీసిన మరో ఫొటోను దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్ పంచుకున్నారు.

ఈమధ్య నే ‘మన్మథుడు 2’ షూటింగ్‌ ప్రారంభమైంది. నాగార్జున సొంత బ్యానర్ మనం ఎంటర్‌ప్రైజెస్‌, మరియు ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2002లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘మన్మథుడు’కు సీక్వెల్‌ చిత్రం ఇది. అందులో సోనాలీ బింద్రే హీరోయిన్‌లుగా నటించారు. ప్రముఖ రైటర్ త్రివిక్రమ్ రచనలో కె. విజయ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.ఈ మూవీ లో బ్రహ్మానందం లవంగం పాత్రలో చేసిన కామిడీ సూపర్ గా పేలింది అటువంటి సూపర్ హిట్ మూవీ కి సీక్వెల్‌ గా వస్తున్న మన్మధుడు2 మూవీ ప్రేక్షకులకు కి ఎంత వరకు మేపిస్తుందో చూడాలి.

Written by Karthik!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *