సినిమా రివ్యూ : మజిలీ

నటి నటులు : నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌషిక్‌, రావూ రమేష్‌,పోసాని
సంగీతం : గోపి సుందర్‌
నేపథ్య సంగీతం : తమన్‌
కథ, దర్శకత్వం : శివా నిర్వాణ
నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2019

నాగచైతన్య సమంత పెళ్లయ్యాక కలిసి నటించిన చిత్రం “మజిలీ”. ఈ మూవీ టీజర్, ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగేలా చేశారు. ఇక చైతు సమంత ఇద్దరు కలిసి పెళ్ళికి ముందు మూడు సినిమాల్లో నటించారు ఇక మజిలీ మాత్రం పెళ్లి తర్వాత చిత్రం కావడం తో సినిమా మీద అంచనాలు ఎక్కువ అయ్యాయి ఇక నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా సక్సెస్‌ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం మజిలీ. గత కొంత కాలం గా సక్సెస్ లేని చైతు మరి ఈ సినిమా అయినా చైతూ కెరీర్‌ను సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కించిందా..? ప్రేక్షకులను అలరించేలా ఉందా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

పూర్ణ టీనేజ్ కుర్రాడు. క్రికెట్ నేషనల్ కి ఆడాలి అని కలలు కంటుంటాడు ఎందుకు. తన కలలు నెరవేచుకునేందుకు పూర్ణ నాన్న ఒక సంవత్సరం సమయం ఇస్తాడు అందుకోసం రైల్వేస్‌ టీమ్‌లో క్రికెటర్‌గా స్థానం కోసం ఆ టీం మెంబెర్ డబ్బులు అడుగుతాడు ఎలాగైనా డబ్బు ఇచ్చి టీమ్ లో ఆడాలి అని ఒక చిన్న దొంగతనం చేస్తాడు ఆ దొంగతనం వల్ల వచ్చే గొడవ కారణంగా అన్షు పరిచయం అవుతుంది, ఆ పరిచేయం కొన్ని రోజులులకి ఇద్దరు ప్రేమలో పడతాడు. కానీ ఇద్దరు లవ్ లో ఉన్నపుడు పూర్ణ కి తన క్రికెట్ టీం కి గొడవ అవుతుంది అందువల్ల పూర్ణ వేరే టీం కి క్రికెట్ ఆడుతాడు పూర్ణ ఆన్సు కలిసి ఉండే టైం లో లోకల్ గ్యాంగ్ గొడవ చేస్తారు ఆ విషయం ఇంట్లో తెలిసిన ఆన్సు పెద్దలు వారి ప్రేమకు అడ్డు చెప్తారు. అన్షును తన పేరెంట్స్ పూర్ణకు దూరంగా తీసుకెళ్లిపోతారు ఆన్సు పూర్ణ ని ఒక హోటల్ లో ఒక గది లో తన కోసం ఎదురు చూడమని చెప్పి వెళ్లి పోతుంది అప్పటినుంచి పూర్ణ ఆ గది కి అపుడపుడు ఆ గది కి వెళ్లి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు… అన్షు దూరమైందన్న బాధలో పూర్ణ కెరీర్‌ను క్రికెట్ ని వదిలేసి తాగుబోతులా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు . అలా డిప్రెషన్ లో ఉండగానే శ్రావణి (సమంత)తో పెళ్లి చేస్తారు. తను ప్రేమించిన ప్రేయసిని మర్చిపోలేక భార్యకి సరిగా దగ్గర అవ్వలేక కాపురం చేయలేక పూర్ణ ఎలాంటి మానసిక క్షోభ అనుభవించాడు. అందరూ తాగుబోతు పెళ్ళాం సంపాధనమీద బ్రతుకుతునాడు అంటే పడలేక చివరకు జాబ్ కోసం డెహ్రాడూన్ కి వెళ్తాడు క్రికెట్ అకాడమీ లో పని చేయానికి అక్కడ కి తను లవ్ చేసిన అన్షు కూతురు జాయిన్ అవుతుంది ఆ కూతురు కి శిక్షణ ఇవ్వడం కోసం అమ్మయి ని తన ఇంటికి పిలుచుకొని వస్తాడు అమ్మయి ఆనందం కోసం భార్య శ్రావణి దగ్గర గా ఉంటాడు ఆ దగ్గర కావడం వల్ల తన భార్య విలువ తెలిసి పూర్ణ మారిపోతాడు అన్నదే స్టోరీ.

ప్లస్ పాయింట్స్ :

నాగచైతన్య, సమంత నటన
దివ్యంశ కౌశిక్ అందం
పాటలు
నేపథ్య సంగీతం
డైరెక్షన్

మైనస్ పాయింట్స్ :

స్లో నెరేషన్ స్టోరీ లో బలం లేకపోవడం , అనుకున్న పాయింట్ సరిగ్గా లేకపోడం

నటీనటులు పెర్ఫార్మెన్స్:

సమంత ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచింది. దివ్యాంశ కౌశిక్ గ్లామర్ తో అలరించింది, సమంత మధ్య తరగతి గృహిణిగా అద్భుతంగా నటించింది. నాగచైతన్య నటన విషయానికి వస్తే నటుడిగా మజిలీ చిత్రం లో ఎంతో పరిణితి కనపరిచాడు .చాలా బాగా నటించాడు. టీనేజ్ కుర్రాడిగా, తీవ్ర మానసిక క్షోభ అనుభవించే యువకుడిగా రెండు విభిన్న కోణాలను ప్రదర్శించి నటుడిగా మరో మెట్టు ఎదిగాడు చైతూ. ఇతర పాత్రల్లో రావూ రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్‌ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం :

నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివా నిర్వాణ మరోసారి ఎమోషనల్‌ డ్రామానే ఎంచుకున్నాడు. మరోసారి హృదయానికి హత్తుకునే అంశంతో మజిలీ ని రూపొందించిన.కథలో ఎలాంటి బలం లేకుండా పోయింది ఎలాంటి కమర్షియల్‌ హంగులకు పోకుండా తను అనుకున్న కథను రియలిస్టిక్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. కథనం నిన్నుకోరి మొన్న వచ్చిన విశ్వాసం తరహాలోనే అనిపించినా ప్రేక్షకుడిని కట్టి పడేయటంలో దర్శకుడు మరోసారి సక్సెస్‌ అయ్యాడు. ఎమోషనల్ లవ్ డ్రామాతో సక్సెస్ అయ్యాడు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ పాటలు అలరిస్తాయి. తమన్ తన నేపథ్య చాలా బాగుంది సంగీతంతోనే సీన్స్ ను మరోస్థాయికి తీసుకెళ్లాడు. తమన్ రీ రికార్డింగ్ మజిలీ కి హైలెట్ గా నిలిచింది.ఈ మూవీ కి నేపధ్య సంగీతం ప్రధాన బలం సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు :

మూవీ లో స్టోరీ చాలా ట్విస్టులు ఎమోషన్ ఎక్కువ గా ఉన్న సినిమా మజిలీ. కథగా నేరుగా చెప్పకుండా సాగదీసి చెప్పడం ప్రేక్షకుడిని సహనాన్ని విసిగితుస్తుంది . సమంత చైతూ పెర్ఫార్మన్స్ తో చివర్లో కథను ముగించిన విధానం సినిమాకు ప్లస్ అనిచెప్పవచ్చు. యూత్‌, ఫ్యామిలీ ని లవర్స్ ని ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగలిగితే కమర్షియల్‌గా సక్సెస్ సాధించే అవకాశం ఉంది.

రేటింగ్ 3/5

Written by Karthik!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *