మహేష్ కి ఇష్టం లేకుండానే మహర్షి ని విడుదల చేస్తున్నారా?

 

భరత్ అనే నేను భారీ హిట్ తర్వాత మహేష్ నట్టిస్తున్న 25వ చిత్రం మహర్షి. ఈ సినిమా పై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు అయితే తాజాగా ప్రకటించిన మహర్షి విడుదల తేది పైన మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణాలు లేకపోలేదు, గతంలో మహేష్ సినిమాలు నిజం, నాని, మరియు బ్రహ్మోత్సవం మే లో రిలీజ్ అయ్యి డిజాస్టర్లు గా మిగిలిపోయాయి. దాంతో ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందా అని కంగారు పడుతున్నారు.

నిజానికి మహేష్ ఈ సినిమా ని ఏప్రిల్ లో విడుదల చేయమని మేకర్స్ పై ఒత్తిడి తెచ్చాడు, కానీ అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ కాకపోవడం అలాగే రీ షూట్ ల వల్ల ఈ విడుదల కాస్తా మే కి వెళ్ళింది. ఇక దాంతో ఫాన్స్ తో పాటు మహేష్ కూడా సినిమా రిలీజ్ డేట్ పై సంతృప్తిగా లేడు అని సమాచారం.

మరి మహేష్ బయపడుతున్నట్లే ఈ సినిమా అయన కెరీర్ లో మరో డిజాస్టర్ అవుతుందా లేక సెంటిమెంట్ ని బ్రేక్ చేసి బ్లాక్ బ్లాస్టర్ అవుతుందో తెలియాలి అంటే మే 9 వరకు ఆగాల్సిందే.