మహేష్ బాబును తొందరపెడుతున్న డైరెక్టర్ ఎవరు?

సినీ దర్శకుడు అనీల్ రావిపూడ, మహేష్ ను పరుగులు పెట్టిస్తున్నాడట. ఈ యంగ్ డైరెక్టర్ స్పీడ్ ను చూసి మన ప్రిన్స్ మహేష్ బాబు ఆశ్చర్యపోతున్నాడట. ఎంతలా అంటే తాను కూడా లీవ్స్ తీసుకోకుండా షూటింగులో గ్యాప్ లేకుండా అనుకున్నపని పూర్తయ్యేంత వరకు పట్టువదలని విక్రమార్కుడిలా అనీల్ రావిపూడ ఉన్నాడట. ఎలాగైనా డెడ్ లైన్ లోగా మూవీ పినిష్ అయ్యేలా టార్గెట్ పెట్టుకుండని చెబుతున్నారు.

మహేష్ బాబు మరియు రష్మిక జంటగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో “సరిలేరు నీకెవ్వరు” సినిమా తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రెండు నెలల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తోంది అని వెల్లడించారు. ఇప్పటికే కాశ్మీర్ షెడ్యూల్ ఫినిష్ చేసిన దర్శకుడు రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ట్రైయిన్ సెట్ షూటింగ్ కూడా ఫినిష్ చేశారు. ఈ ట్రైయిన్ ఎపిసోడ్ సినిమాలో చాలా కీలకమని ప్రతేకంగా తెలుస్తోంది.

త్వరలోనే మహేష్ పై ఆర్మీలో బ్యాక్ డ్రాప్ సీన్స్ కూడా షూట్ చేయనున్నట్టు మనకు తెలుస్తోంది. ఆతరువాత మాజీ రామోజీ ఫిలింసిటీలో కొండారెడ్డి బురుజు సెట్ షూట్ కూడా చేయనున్నారట. ఇకపోతే క్లయిమాక్స్ ను కేరళలో ప్లాన్ చేయబోతున్నట్టు సినీవర్గాల సమాచారం.

సరిలేరు నీకెవ్వరూ సినిమాను ఎట్టకేలకు సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట. ప్రస్తుతం నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో దర్శకుడు మరింత స్పీడ్ తో షూట్ చేస్తున్నారట. చెప్పిన సమయం కంటే ముందే సినిమాను పూర్తి చేయాలని సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.