మహర్షి సినిమాలో హైలైట్ పాయింట్స్..!
సెన్సారు నుండి మహర్షి ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనికితోడు మహర్షి సినిమాలో హైలైట్స్ పాయింట్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి. ఇందులో మహేష్ బాబు సక్సెస్ సక్సెస్ అంటూ తొలిసగంలో హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుందని తెలుస్తోంది. బాగా డబ్బు, పేరు సంపాదించిన హీరో కొన్ని కారణాలవలన వలన సెకండ్ హాఫ్ లో పల్లెటూరు రావడం అక్కడి నుండి క్లైమాక్స్ వరకు అభిమానులకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయని టాక్.
మహర్షి సినిమాలో హైలైట్ పాయింట్స్ ఇవే :
రిజిస్టార్ ఆఫీసులో రైతుల భూముల కోసం వచ్చే సీన్
సాయికుమార్-మహేష్ బాబు మధ్య వచ్చే సీన్ లు అభిమానులకు బాగా నచ్చుతాయి అంట.
ఓ గ్రామం వదిలేయి అని అడిగి, మళ్లీ అన్నీ గ్రామాలు వదలాల్సిందే అంటూ హీరో సవాలు చేసే సీన్.
మహేష్ బాబు ప్రెస్ మీట్ లో చెప్పే డైలాగ్స్ హై లైట్ లుగా వుంటాయని టాక్.
అలాగే క్లయిమాక్స్ లో రైతుల కోసం హీరో చేసే ప్రయత్నం బాగుందని టాక్ వినిపిస్తోంది.
క్లయిమాక్స్ లో వచ్చేపాట ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు.
మొత్తంమీద ఓ కమర్షియల్ సినిమాకి మంచి మెసేజ్ కలిపితే ఎలా వుంటుందో, మహర్షి సినిమా అలా వుంటుందన్నది సెన్సారు టాక్.
ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే మహర్షి సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే..