హంగామా : మహేష్ ,తారక్ కలిసిన వేళ

ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి సతీమణి పుట్టినరోజు వేడుకకు మహేష్ తారక్ ఇద్దరూ స్టార్ హీరోలు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరి కలయిక నేటింట సందడి చేస్తోంది.

తెలుగు హీరోలు ఇద్దరు కలసి ఒకచోట కనిపిస్తే అభిమానుల ఆనందమే వేరు. తాజాగా మహేష్ జూనియర్, ఎన్టీఆర్ కలసి సందడి చేశారు. వంశీ పైడిపల్లి సతీమణి మాలిని పుట్టిన రోజు సందర్భంగా వీరిద్దరూ కూడా తమ భార్యలతో
కలిసి హాజరయ్యారు.

ప్రస్తుతం మహేష్… వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరెక్కిస్తున్న మూవీ ” మహర్షి” చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మే 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్.. రాజామౌళి దర్శకత్వంలో “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలో నటిస్తున్నాడు. ఇద్దరూ హీరోలు తమ పనుల్లో బిజీగా తీరిక లేకుండా ఉన్నా… ఇలా కలవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

  • 7
    Shares