మహేష్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ కి వీళ్లు డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది.?

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాతో బాక్స్ ఆఫీస్ షేక్ చేశాడు. అలాగే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన గత సినిమా అరవింద సమేత చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చాటాడు. ఇద్దరు ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టే స్టామినా ఉన్న హీరోలే సూపర్ స్టార్ మహేష్,  ఎన్.టి.ఆర్ సినిమాల పరంగా ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్న ఈ ఇద్దరి కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

మహేష్ భరత్ అనే నేను ఆడియోకి ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చి అన్నయ్యా అని పిలవడం అందరిని సర్ ప్రైజ్ చేసింది. అయితే ఒకే వేదికపై ఒకసారి కనిపిస్తేనే అలా ఉంటే ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో. అదిరిపోతుంది కదా ఇప్పుడు అదే వార్త టాలీవుడ్ లో వైరల్ అవుతుంది.

మహేష్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ చేస్తే ఆ సినిమా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అయితే ఇప్పటికే రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో తారక్, చరణ్ తో కలిసి  చేస్తున్నాడు.  ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్, మహేష్ మల్టీస్టారర్ చేస్తే అది త్రివిక్రం డైరక్షన్ లో లేదా సుకుమార్ ఉండాలని ఆశిస్తున్నారు.

ఈ డైరెక్టర్లు మంచి కథతో పాటు, వీరికి ఇద్దరి హీరోల కెపాసిటీ తెలుసు కాబట్టి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ డైరెక్షన్ చేయగల సత్తా వీరికి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న త్రివిక్రం ఆ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేస్తాడని టాక్. అలాగే సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడు అది పూర్తయిన వెంటనే మహేష్ బాబును డైరెక్ట్ చేయనున్నాడు. మరి అభిమానులు కోరుకుంటున్న మహేష్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ సినిమా కలగానే మిగులుతుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *