మహర్షి సినిమా రికార్డుల మోత ఎలా ఉంటుందో చెప్పినా సెలబ్రెటీ..!

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మహర్షి. సూపర్ స్టార్ 25 మూవీ కావడంతో ముందు నుంచి భారీ అంచనాలున్నాయి, ట్రైలర్ రిలిజ్ అయిన అంచనాలు తర్వాత మరింత ఎక్కువయ్యాయి.
తాజాగా సెన్సార్ బోర్డు నెంబర్ ఉమైర్ సందు కూడా మహర్షి సినిమా పై సూపర్ పాజిటివ్ ట్వీట్ చేశారు. మహర్షి అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న అద్భుతమైన సినిమా, తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు.
ఉమైర్ సందు ట్వీట్ చూస్తుంటే కథ ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుందని స్క్రీన్ప్లే వినోదాత్మకంగా ఉంటుంది అని తెలుస్తుంది.
ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు కాలేజీ కుర్రాడు గా, CEO గా, ఆ తర్వాత రైతుగా ప్రేక్షకులను 3 రకాల పాత్రాలతో మహేష్ అందరినీ కట్టి పడేస్తాడు అని పేర్కొన్నారు, దర్శకుడు సినిమా కోసం ఎంచుకున్న సబ్జెక్ట్ ఎంతో అద్భుతంగా ఉందని అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉందని పేర్కొన్నారు.
ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే కథలో డెప్త్ ఉన్న విషయం స్పష్టమవుతోంది. ఇంకా పూజా హెగ్డే గ్లామర్ తో అదర కొట్టేసిందని, ఇందులో అల్లరి నరేష్ ముఖ్యమైన పాత్ర పోషించడం తెలిసిందే. అయితే ఉమైర్ సందు తన ట్వీట్ లో పేర్కొనబడక లేకపోవడం గమనార్హం. అయితే చిత్రబృందం మాత్రం కథలో నరేష్ పాత్ర చాలా బాగా హైలెట్ గా నిలుస్తుంది అంటున్నారు. చిత్రం పైసా వసూల్ సినిమా అని అన్ని రకాల ప్రేక్షకులను ఎంటర్టై్మెంట్ చేస్తుంది అని ఉమైర్ సందు తన ట్వీట్ ద్వారా తెలియజేశాడు.