మహర్షి ప్రీమియర్ షో టాక్, పబ్లిక్ రెస్పాన్స్..

సాధారణ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశం గర్వించే స్థాయికి ఎలా ఎదిగాడు, అలా ఎదిగే క్రమంలో తను ఎదుర్కొన్న సమస్యలు , తరువాత ఏమైంది అనే సంఘటనలు ఆధారంగా తీసుకొని డైరెక్టర్ సినిమా తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా మహేష్ కి  25వ మూవీ కావడంతో తన ప్రాణం పెట్టి నటించడని చెప్పొచ్చు. మహేష్ బాబు ఈ చిత్రంలో 3 పాత్రలో కనిపించాడు. కాలేజ్ కుర్రాడిగా, కంపెనీ గా, ఒక రైతుగా విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ పూజ హెగ్డే కూడా నటన, అందంతో పాటు మహేష్ పక్కన బాగా సెట్ అయింది. ఇంకా ఒక ప్రతేక పాత్రలో నటించిన అల్లరి నరేష్ కూడా ఆ పాత్రలో తనని తప్ప ఇంకెవరికి ఊహించలేనట్లు గా నటించి అందరినీ అచర్యపరిచాడు.

సినిమాలో నటించిన సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, జయసుధ, రాజీవ్ కనకాల మరియు రావు రమేష్ తమ నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఇప్పటికే మహర్షి షో లు కంప్లీట్ అవడంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మహర్షి మహేష్ కెరీ్లోనే చిరస్థాయి గా నిలుస్తుంది అంటున్నారు.

ముఖ్యంగా మహేష్ రైతు పాత్రలో నటన అద్బుతం అని, ఇంకా ఇదే కథ నీ కథ సాంగ్ చూస్తున్నపుడు అందరూ ఎమోషనల్ అవుతారు అని,  సినిమాలో సగం బలం క్లైమాక్స్ అని, క్లైమాక్స్ లో మహేష్ నటన మరో లెవెల్లో ఉంటుంది అని కూడా చెపుతున్నారు.

ఇంకా నరేష్ పాత్ర గురించి కూడా గొప్పగా చెప్పుతున్నారు. మొత్తం మీద ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన మహర్షి మూవీ అందరినీ మోపించిందని చెపుతున్నారు, చూడాలి మహర్షి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏటువంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో..