మహర్షి మూవీ రిలీజ్ డేట్ వెనుక చిరంజీవి హస్తం.. !!

సూపర్ స్టార్ మహేష్ నటించిన చిత్రం మహర్షి మే 9వ తేదీన గ్రాండ్ గావిడుదలకానుంది. ఈ మే 9 రిలీజ్ డేట్ వెనుక చాలా పెద్ద కథే ఉంది. 1990 మే 9 న మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవిలు జంటగా వైజయంతి బ్యానర్ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించింది. అలాగే వైజయంతి నిర్మాతలు నిర్మించిన ‘మహానటి’ కుడా మే 9న విడుదలై గ్రాండ్ సక్సెస్ పొందింది.

ఆ డేట్ ని నిర్మాత అశ్వినీ దత్ కి ఆ లక్కీ డేట్‌ అంటారు మరి ఈ తేదీ ని ‘మహర్షి’ చిత్రానికి కుడా సెట్ చేశారు. ఆ గత రెండు చిత్రాల మాదిరే ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు మరి మే 9వ తేదీ మెగాస్టార్ కి లక్ అయినట్లు మహేష్ బాబుకి కూడా లక్కీ అవుతుందేమో ఈరోజు చూడాలి. మహర్షి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు మూవీ లో పూజా హెగ్దే హీరోయిన్‌గా అల్లరి నరేష్ ఒక కీలక పాత్రను చేయడం జరిగింది… !!!