బ్రేకింగ్ న్యూస్ : బిగ్ బాస్ 3 లో నటి ఆత్మహత్య యత్నం

బిగ్ బాస్ రియాలిటీ షో ప్రజలలో ఎంత ఆదరణ పొందుతుందో అందరికి తెలిసిన విషయమే. టీఆర్పీ రేటింగ్ లో సైతం దూసుకుపోతుతుంది , వివిద భాషల్లో ప్రసారం అవుతున్న ఈ షో ప్రజలను ఎంతగానో అలరిస్తుంది.

అయితే తమిళనాడు లో రెండు సిసన్ లు విజయవంతంగా పూర్తిచేసుకుంది, ప్రస్తుతం బిగ్ బాస్ సీసన్-3 లో ఒక నటి ఆత్మహత్య యత్నం కి ప్రయత్నించటం తో సంచలనంగా మారింది , ప్రముఖ సినీ హాస్య నటి మధుమిత ఆత్మహత్య యత్నం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

బిగ్ బాస్ లో యాబై రోజులకు పైగా గడిపిన మధుమిత గత శనివారం హౌస్ లీడర్ గా వ్యవహరించింది . ఆ సమయంలో కావేరి వివాదంలో ఆమె కొన్ని వాఖ్యలు చేయటంతో ఇతర పోటీ దారులకు ఆమెకు మధ్య గిడవలు జరిగాయి, దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది తన ఎడమ చేతి మడికట్టుపై కత్తితో కోసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో ఆమెను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పంపించేశారు.