నిరుద్యోగం ఓ మానసిక స్థితి మాత్రమే !!

నిన్న ఓ సోదరుడు చిన్న పెట్టుబడితో వ్యాపారం పెట్టి వేలు,లక్షలు సంపాదించడం మాటల్లో సాధ్యమా అని అడిగాడు.. పెట్టిన చిన్న వ్యాపారం “గోంగూర బిర్యాని” అంటే నేను వంటలు బాగా చేస్తా అనుకోండి . సరే విషయంలోకి వెళదాం..

ఈరోజు నా పెట్టుబడి ..

10కేజీల బాస్మతి బియ్యం -660రూ
5 కేజీల చికెన్ – 1100రూ
మసాలా దినుసులు,వంట సామాగ్రి,పెరుగు తదితర వస్తువులు -400రూ
ఆయిల్ 2 లీటర్స్ – 160రూ
గ్యాస్ -300
స్టాల్ – 2000
తెరమకాల్ బాక్స్ -500
గ్యాస్ స్టవ్ – 1000
వంట గిన్నెలు,గరిటలు-1100
పార్సెల్ బాక్సలు – 1005 =500 ఫ్లెక్సీ బ్యానర్ = 500 వెరసి నా పెట్టుబడి – 8,220 రూ అమ్మిన బిర్యాని ప్యాకెట్లు =57 (3 గంటల వ్యవధిలో) నా లాభం 2,800రూ ఇలా నేను మరో 5 చోట్ల మొదలు పెడతా..అప్పుడు రోజు వారి ఆదాయం 52800 = 14000 ×25 రోజులు =3లక్షల 50 వేలు ..అంటే సంవత్సరానికి సుమారు 50 లక్షలు (చిన్న పెద్ద అదనంగా వచ్చే ఆర్డర్స్ కలుపుకుని) ఇప్పుడు చెప్పండి కష్టం అంటే ఏంటి ??

ఇంట్లో గడిచిపోతుంటే ప్రతీది అవమానమే..

రేపు ఏంటి అన్న భయం కలిగితే ప్రతీది సంపాదించడానికి ఓ అవకాశమే..
నా దృష్టిలో “ఎక్కువుగా వాడుకలో ఉండే వస్తువుని తక్కువకు తెచ్చి అమ్మడమే వ్యాపారం”
ఈరోజు నుండి సంవత్సరం పాటు ఇదే వ్యాపారం ఆడుతూ పాడుతూ చేసిన వచ్చే సంవత్సరం మరో 3 bedroom అపార్ట్మెంట్ కొనచ్చు..లేదా జాగ్వర్ కార్ కూడా కొనుక్కోవచ్చు ..

ఒళ్ళు వంచడం చేతకాకపోతే ప్రతీది ఓ కారణమే..

అంటే నాకు ముందు వ్యాపారాలు అదృష్టం తో కలిసివచ్చాయి అనుకుంటే అబద్ధమే..ఒళ్ళు వంచితే ప్రతీ వ్యాపారం లాభదాయకమే అన్నమాట.

Written by Karthik

  • 10
    Shares