కూతుర్ని స్కూల్ బస్సు ఎక్కించే క్రమంలో క్లీనర్‌తో ప్రేమలో పడిన వివాహిత.. తర్వాత ఏం జరిగింది?

ఇద్దరు అవివాహితుల మధ్య ప్రేమను సమాజం ఆమోదిస్తుంది. కానీ అప్పటికే పెళ్లయ్యి, స్కూలుకెళ్లే పాప ఉన్న మహిళ ప్రేమలో పడితే..? ఆమె ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నిస్తే..? కానీ  తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అదే జరిగింది ఒక వివాహిత తన భర్తకు దూరంగా కొన్ని కారణాల వలన విడిపోయి, తన తండ్రి తో కలిసి వేరే ఊరు వచ్చి ఉంటూ ఆమె కూతుర్ని స్కూలుకు పంపేది. తన కూతుర్ని స్కూలు బస్సు ఎక్కించే క్రమంలో  అనపర్తి పాత ఊరికి చెందిన వివాహితకు ఆ స్కూల్ బస్సు క్లీనర్‌తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారడంతో.. ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు.

ఇది ఊర్లో తన తండ్రికి, వారి బంధువులకి తెలిస్తే మర్యాదపూర్వకంగా ఉండదని భావించిన వారిద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రయత్నించింది. తన కూతురు వ్యవహార శైలి అనుమానచితంగా ఉండడంతో ఆమె తండ్రి వెంకటేశ్వర రావు మందలించాడు.

దీంతో ఆగ్రహించిన ఆమె ప్రియుడు.. ప్రియురాలి తండ్రి అయినటువంటి వెంకటేశ్వరరావు గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడ్డ వెంకటేశ్వర రావును హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.