భారత దేశ రాష్ట్రపతులు – List of Indian Presidents

 

బాబు రాజేంద్రప్రసాద్ (26-1-1950 నుండి 18-5-1962 వరకు) :

 * భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి

* రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షునిగా పని చేశారు.

 * ఎక్కువ పర్యాయాలు సుప్రీంకోర్టు సలహా తీసుకున్న రాష్ట్రపతి.

 హిందూ కోడ్ బిల్లు విషయంలో ఆమోదం తెలుపకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

* రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి.

 

 

సర్వేపల్లి రాధాకృష్ణన్ (13-5-1962 నుండి 13-5-1967 వరకు):

Sarvepalli radhakrishnan-Second Indian President

 

* మొట్టమొదటి ఉపరాష్ట్రపతి

* ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి వ్యక్తి

* జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి రాష్ట్రపతి.

* టెంపుల్టన్ అవార్డును పొందిన తొలి భారతీయుడు.

  

 జాకీర్ హుస్సేన్ (13-5-1967 నుండి 3-5-1969 వరకు) : 

 

* మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి.

* పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి.

* అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు.

 

 

 

వరహగిరి వెంకటగిరి (3-5-1969 నుండి 20-7-1969 వరకు) మరియు (24-8-1969 నుండి 24-8-1974 వరకు) :

 

 

* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి.

 * ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉండేవారు.

* స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి.

 * జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండవ రాష్ట్రపతి.

 

 

జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా (20-7-1969 నుండి 24-8-1969 వరకు) :

 

 

* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొట్టమొదటి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవి రెండూ ఖాళీగా ఉండటం

వలన రాష్ట్రపతిగా వ్యవహరించారు.

 

 

ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (24-8-1974 నుండి 11-2-1977 వరకు) :

 

 * రెండవ ముస్లిం రాష్ట్రపతి

* పదవిలో ఉండగా మరణించిన రెండవ రాష్ట్రపతి.

* అత్యధికంగా ఆర్డినెన్స్లు జారీ చేసిన రాష్ట్రపతి.

 

 

 

బసప్ప ధనప్ప జెట్టి (11-2-1977 నుండి 25-7-1977 వరకు) :

 

 

* తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన మూడవ వ్యక్తి.

 

 

 

 

నీలం సంజీవరెడ్డి (25-7-1977 నుండి 25-7-1982 వరకు) :

 

* అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

* ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి.

* ఆంధ్రప్రదేశ్ సీఎంగా, లోక్ సభ స్పీకర్ గా, రాష్ట్రపతిగా

వ్యవహరించిన వ్యక్తి.

 

 

 జ్ఞానీ జైలసింగ్(25-7-1982 నుండి 24-7-1987 వరకు) :

 

* తొలి సిక్కు రాష్ట్రపతి.

* వివాదాస్పద పోస్టల్ బిల్లుపై పాకెట్ వీటోను వినియోగించారు.

* స్వర్ణ దేవాలయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ ఈయన

కాలంలో జరిగింది.

 * వెనుకబడిన తరగతుల నుండి వచ్చిన మొదటి రాష్ట్రపతి.

 

 

ఆర్.వెంకట్రామన్(25-7-1987 నుండి 24-7-1992 వరకు) :

 

* అత్యధిక ప్రధానుల చేత (వి.పి.సింగ్, చంద్రశేఖర్,

పి.వి.నరసింహారావు) పదవీ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి.

 * కేంద్ర రక్షణ, హోంమంత్రిగా పనిచేశారు.

 

 

 

డా. శంకర్ దయాళ్ శర్మ (25-7-1992 నుండి 25-7-1997 వరకు) :

 

* వివాదాస్పదమైన దళిత క్రిస్టియన్లకు సంబంధించి

రిజర్వేషన్ బిల్లుపై వీటో చేశాడు.

* ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కూడా పని చేశారు.

 

 

కె.ఆర్.నారాయణన్ (25-7-1997 నుండి 25-7-2002 వరకు) :

 

* దళిత వర్గానికి చెందిన మొదటి రాష్ట్రపతి.

* ఓటుహక్కును వినియోగించుకున్న మొదటి రాష్ట్రపతి.

* బీహార్, ఉత్తరప్రదేశ్లలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలనే కేంద్ర ప్రభుత్వ తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనకకు

పంపారు.

 

 

 ఏ.పి.జె. అబ్దుల్ కలాం (25-7-2002 నుండి 25-7-2007 వరకు) :

 

* రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి

* ఢిల్లీ శాసనసభల ఎన్నికలలో ఓటుహక్కును వినియోగిం

చుకున్న రెండవ రాష్ట్రపతి. లాభదాయక పదవుల బిల్లు

విషయంలో సస్పెన్సివ్ వీటో ఉపయోగించిన రాష్ట్రపతి

 

 

శ్రీమతి ప్రతిభాపాటిల్ (25-7-2007 నుండి 25-7-2012 వరకు):

 

 * మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. రాజస్థాన్ గవర్నర్ గా, మహారాష్ట్ర

మంత్రిగా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్ పర్సన్ గా పనిచేశారు.

* బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆహ్వానం అందుకున్న తొలి దేశాధినేత.

 * అత్యధిక దేశాలు పర్యటించిన రాష్ట్రపతి.

 

 

ప్రణబ్ ముఖర్జీ (25-7-2012 నుండి 2017 వరకు) :

 

* పదవీ రీత్యా పదమూడవ రాష్ట్రపతి

* ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

* కేంద్రంలో ఆర్థిక, రక్షణ, వాణిజ్య, విదేశాంగ మంత్రిగా పనిచేశారు.

 

 

రామ్ నాథ్ కోవింద్ (జులై 25, 2017 నుండి…) :

 

* పదవీ రీత్యా పద్నాల్గవ రాష్ట్రపతి.

* అత్యున్నత రాజ్యాంగ పదవి చేపట్టిన రెండవ దళిత వ్యక్తి.

* సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *