AP లో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ఎపుడు అంటే….?

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఒక ఏపీలో తప్ప మిగిలిన అన్ని చోట్ల రిలీజ్ అయినా సంగతి అందరికి తెలిసిందే. ఏపీలో ఎన్నికలు జరుగుతుండటం వలన చిత్రాన్ని విడుదల చేయకుండా కొందరు టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు . కోర్టు కూడా సినిమాను ఏపీలో రిలీజ్ అవకుండా చేసింది .

ప్రస్తుతం ఎన్నికలు పూర్తి అవడం తో సినిమాను ఏపీలో విడుదల చేయడానికి నిర్మాతలకు అనుమతులు లభించాయి. లక్ష్మిస్ ఎన్టీఆర్ మే 1న చిత్రం విడుదల అవనుంది. ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ఈ సినిమాను రాంగోపాల్ వర్మ తెరకెక్కించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *