లిప్ కిస్, హాట్ సీన్లు చేసింది నేను కాదు అంటున్న రామ్ చరణ్ హీరోయిన్.?

టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయినటువంటి మహేష్ బాబు, రామ్చరణ్ చిత్రాలు అయిన భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా అద్వానీ.. ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయినా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ అయినటువంటి కబీర్ సింగ్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో షాయిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా..కియారా హీరోయిన్ గా చేస్తుంది. ఈ చిత్రానికి తెలుగులో డైరెక్ట్ చేసిన సందీప్..హిందీలోను డైరెక్ట్ చేసాడు. తెలుగు ఇండస్ట్రీలో లిప్ లాక్ లు హాట్ రొమాన్స్ ట్రెండ్ అర్జున్ రెడ్డి నుండే మొదలైంది అని తెలిసిందే. ఆ సినిమాకి రీమేక్ అయిన కబీర్ సింగ్ లో కూడా  హాట్ రొమాన్స్ , లిప్ లాక్ లు దండిగా ఉన్నాయట. వీటి ఫై కియారా స్పందించింది.

కైరా అద్వానీ ముద్దు సన్నివేశాలు గురించి స్పందిస్తూ  ముద్దు సీన్స్ ను చాలా నార్మల్ గా చేశామంటూ, ఇతర సీన్స్ మాదిరిగానే ఆ సీన్స్ ను కూడా చిత్రీకరించాం. కథలో ముద్దు సీన్లు చాలా ప్రాముఖ్యత ఉంటుంది  కనుక వాటికి ఎక్కువ కష్టపడకుండా చేశామంటూ ..షూటింగ్ సమయంలో లిప్ లాక్ సీన్స్ చేసినప్పుడు తప్ప అంతకు ముందు ఆ తర్వాత వాటి గురించిన ఆలోచనే లేదని ఆ సీన్స్ చేస్తున్నప్పుడు నేను క్యారెక్టర్లో లీనమైపోయాను అని ఆ సన్నివేశం అయిపోయే వరకు నేను నేను లా లేనని అంటే ఆ క్యారెక్టర్ అంత ఇష్టంగా చేశానని చెప్పుకొచ్చింది.

తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ కూడా బాలీవుడ్ ను షేక్ చేస్తుందేమో చూడాలి. ఈ చిత్రం జూన్ 21 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *