రివ్యూ : సీత (బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్)

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూసూద్
దర్శకత్వం : తేజ
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
సంగీతం : అనూప్ రుబెన్స్
సినిమాటోగ్రఫర్ : శిరిషా రే
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర్ రావ్
సాక్ష్యం, కవచం ఆశించిన ఫలితాలు అందుకోకపోవడంతో కాజల్ తో కలసి బెల్లంకొండ శ్రీనివాస్ ‘సీత’ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మన ముందుకు వహించాడు. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మోడరన్ సీత అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ లో కాజల్ ఓ డిఫ్రెంట్ రోల్ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ మూవీ శ్రీనివాస్ కి విజయాన్ని అందించిందో లేదో తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్లసిందే..
కథ :
అలనాటి సీత సహనం, ఓర్పు కి మరో రూపంగా నిలిస్తే, ఇందులో సీత (కాజల్) స్వార్థం కోసం దేనికైనా ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడడు ఇలాంటి తత్వం కలిగిన సీత ఎమ్మెల్యే బసవతో (సోను సూద్) 5 కోట్ల రూపాయలు ఒప్పందం ఒకటి కుదుర్చుకుంటుంది.
అయితే ఈ ఒప్పందం వలన సీత కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య నుండి బయట పడడానికి సీత అమాయకుడైన రఘురామ్ (బెల్లం కొండ శ్రీనివాస్)ను వాడుకోవాలి అని చూస్తుంది. దానికోసం సీత ఏమి చేసింది? రఘురామ్ సీత యొక్క స్వార్థం తెలుసుకున్నాడా? సీత, బసవ నుండి ఎలా తప్పించుకుంది? సీత రఘురామ్ లు ఒకటయ్యారా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ :
ఈ చిత్రంలో సీత పాత్ర చాలా కీలకం, దీని కోసం నేటి తరం అమ్మాయిల ఆలోచనలను తేజ వాడుకున్నాడు. దర్శకుడు తేజ సీత పాత్ర ని బాగా చూపించాలనే తాపత్రయంతో తన ద్రుష్టి మొత్తం అక్కడే పెట్టాడు. సీత పాత్ర పైన పెట్టిన దృష్టి మిగిలిన కథ పైన పెట్టింటే సినిమా బాగా వచ్చి ఉండేది.
ముఖ్యంగా అమాయకుడైన రఘురాం విలన్ ఎదిరించే సన్నివేశాలు బాగా వచ్చి ఉండేవి, కానీ అలా జరగలేదు అయితే సీత, రఘురామ్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు అందరినీ ఆకటుకునేలగా లేవు. అలాగే బసవ, సీత మరియు రఘురాం మధ్య జరిగే గేమ్ కూడా కొంతవరకు మాత్రమే మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
కాజల్ అగర్వాల్ పర్ఫామెన్స్
బెల్లంకొండ నటన
సోనుసూద్ విలనిజం
అనూప్ రుబెన్స్ సంగీతం
మైనస్ పాయింట్స్ :
బలహీనమైన కథ కథనం
పొంతన లేని సన్నివేశాల
నటినటులు :
ఇక నటీనటుల విషయానికి వస్తే డిఫరెంట్ షేడ్స్ ఉన్న సీత పాత్ర కి కాజల్ అగర్వాల్ న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఆమె నటన సహజంగా అనిపిస్తుంది ఒకరకంగా హీరో తరహాలో సినిమా మొత్తాన్ని తన భుజాల పైన తీసుకెళినదని చెప్పాలి. ఇక అమాయకమైన వ్యక్తిగా శ్రీనివాస్ బాగా నటించాడు క్లైమాక్స్ లో ఆయన నటన అందరిని మెప్పిస్తుంది అని చెప్పాలి, విలన్ పాత్రలో సోనూసూద్ ఆకట్టుకొంటాడు అని చెప్పాలి.
బిత్తిరి సత్తి,మన రా చోప్రా, మరియు అభిమన్యు సింగ్, రంగస్థలం మహేష్ వారి పాత్రla మేరకు బాగానే నటించారు. స్పెషల్ సాంగ్ లో పాయల్ రాజ్ పుత్ అందాలు ఓ వర్గం వారిని ఆకట్టుకుంటాయి.
సాంకేతిక విశ్లేషణ :
ఇక సాంకేతిక విషయాలు కొస్తే కుడి తేజ హీరోయిన్ పాత్రను చక్కగా నే రాసుకున్న మిగతా కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది, అయితే పాత్రల డిజైన్స్ చెయ్యడంలో ఆకట్టుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం చాలా బాగుంది సినిమా లో ఫోటోగ్రఫీ కూడా అలరిస్తుంది, అయితే ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు అక్కడక్కడ తన కత్తెరకు పని చెప్పాల్సి ఉంది. ఇంకా సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.
తీర్పు :
మొత్తంగా చెప్పాలంటే ఆధునిక సీతని ఆడియన్స్ కి పరిచయం చేసి మెప్పించాలని డైరెక్టర్ తేజ ప్రయత్నం బాగానే ఉన్నా సీత మీద పెట్టిన ఫోకస్ సినిమా కథనం ఇతర పాత్రల మీద పెట్టకపోవడంతో ప్రేక్షకులకు ఏంటో తెలియని వెలితి కనిపిస్తుంది. కాజల్ నెగిటివిటీ చూడ్డానికి కూడా ప్రేక్షకులు థియేటర్కు వచ్చే అవకాశం ఉంది అయితే మిగతా వర్గాల ని సినిమా ఏ మేరకు కొట్టుకుంటుంది అనేది చివరికి ఫలితం నిర్ణయించనుంది.
రేటింగ్ 2.5/5