స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనున్న కాజల్. !

తెలుగు ఇండస్ట్రీలో దశాబ్ద కాలం నుండి ప్రేక్షకులను తన అందంతో మెప్పిస్తున్న కాజల్ అగర్వాల్‌,  వయసు పై బడుతున్న తన హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పటికే టాలెంటెడ్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకున్న ఈమె… కేవలం హీరోయిన్ గానే కాకుండా ఎలాంటి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తుంది. జనతా గ్యారేజ్ సినిమా లో ఐటమ్ సాంగ్ చేసి అందరిని మెప్పించిన కాజల్ అగర్వాల్ తాజాగా అల్లు అర్జున్ కొత్త సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ గ్రాఫ్ విషయంలో ఇద్దరికీ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ కావడంతో ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తండ్రి సెంటిమెంట్ తో పాటు, యూత్ ని టార్గెట్ చేస్తూ స్క్రిప్ట్ రెడీ చేశారు త్రివిక్రమ్. ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ కు రాజన్న తో ఉండడంతో ఆ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్‌ని ఎంపిక చేశారని సమాచారం.

ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ కు జోడిగా పూజా హెగ్డే  మరియు నివేదా పేతురేజ్ నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ టబు, మరో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ జనతాగ్యారేజ్ లో పక్కా లోకల్ అనే సాంగ్ లో ఎన్టీఆర్ సరసన స్టెప్పులేసింది. ఆ వీడియో సాంగ్ ఇక్కడ చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *