జూ. ఎన్టీఆర్ vs లోకేష్ : TDP కార్యకర్తలు ఎవర్ని కోరుకుంటున్నారు?

ఎన్నికల ఫలితాల్లో టిడిపి పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయింది అందరికీ తెలిసిందే. అయితే టిడిపి పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు తీసుకుంటారని చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోటీ చంద్రబాబు నాయుడు కొడుకు అయినా నారా లోకేష్ మరియు ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్ మధ్య అని అందరికీ తెలుసు.

అయితే ఏ తండ్రి అయినా తన కొడుకు బాగుపడాలని కోరుకోవడం సహజమే అందుకే పార్టీ పగ్గాలను నారా లోకేష్ చేతిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్న విషయం తెలిసిందే. గత 2009 ఎలక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే ప్రచారానికి జనం నుండి వచ్చిన స్పందన చూసి చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి పోతాయని భావించినట్లు అర్థమైంది. అందుకే పార్టీ తన చేతిలోనే ఉండాలని చంద్రబాబు నాయుడు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీకి దూరంగా పెట్టి నారా లోకేష్ ను పార్టీలోకి ఎంటర్ చేశాడు.

పార్టీలో ఎన్.ఆర్.ఆర్.ఆర్ వలన నారా లోకేష్ కి ప్రధాన ముప్పు అని భయపడి, తన కుమారుడి రాజకీయ జీవితం కోసం తెలుగుదేశం పార్టీ నుండి జూనియర్ ఎన్టీఆర్ తనను తాను దూరం చేసుకునేలా చేశారు చంద్రబాబు నాయుడు.

హరికృష్ణ మరణించిన తరువాత, చంద్రబాబు నాయుడు పార్టీకి తెలంగాణ ఎలక్షన్ లో ప్రచారం కోసం ఎన్టీఆర్ ను ఒప్పించటానికి ప్రయత్నించాడు, కాని కానీ జూనియర్ అందుకు ఒప్పుకోలేదు. అయితే తాజా ఎలక్షన్లు లోకేష్ మంగళగిరిలో ఓడిపోయినందున ఎన్.టి.ఆర్. అభిమానులు నారా లోకేష్ ను ట్రోలింగ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ అభిమానులు నార లోకేష్ ను సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకున్నారు, లోకేష్ ప్రచార సమయంలో నోరు జారిన వీడియో క్లిప్పింగులను, అతని వెర్రి వాంగ్మూలాలను
తమ అభిమాన నటుడు తరపున చంద్రబాబునాయుడు, లోకేష్ ల పైన పగ తీర్చుకుంటున్నారు.

టిడిపి కార్యకర్తలు నారా లోకేష్ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అయితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం.