ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ లో గాయపడిన ఎన్టీఆర్‌..!

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న  మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కలిసి నటిస్తున్నారు. ఇటీవల పూణేలో షూటింగ్ జరుగుతుండగా చరణ్‌ గాయపడటంతో షూటింగ్‌ను మూడు వారాల పాటు వాయిదా వేశారు చిత్ర టీం.

అయితే తాజాగా ఎన్టీఆర్‌ కూడా తన కుడి చేతికి ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ లో గాయం అయినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్‌ కట్టుతో ఉన్న ఎన్టీఆర్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. ఎన్టీఆర్‌ కు జోడి కోసం ఇప్పుడు తాజాగా జాక్వెలిన్ ఫెర్నండజ్‌ ని సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమా లో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారి బడ్జెట్‌ సినిమా ని డీవీవీ దానయ్య డివివి ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు.